Gold Buying Tips: బంగారం ధరలు అందనంత ఎత్తుకు పెరిగిపోతున్నాయి. నిన్న ఒక్కరోజు 2000లకు పైగా పెరగడం విశేషం. వెండి ధరలు కూడా విపరీతంగా పెరుగుతున్నట్లు కనిపిస్తుంది. తాజాగా అక్టోబర్ 14న దేశంలో బంగారం ధరలు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,25,410 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,14,960 గా కొనసాగుతోంది. వెండి కిలో ధర రూ.1,85, 100 గా ఉంది. త్వరలో వెండి రూ. రెండు లక్షలకు చేరుకునే అవకాశం ఉందని అంటున్నారు.
అంతర్జాతీయ పరిస్థితుల కారణాలతోపాటు, బంగారంపై పెట్టుబడి పెరగడంతో వీటికి డిమాండ్ పెరుగుతున్నట్లు తెలుస్తుంది. భవిష్యత్తులో బంగారం ధర 10 గ్రాములు రూ. 2 లక్షల వరకు ఉండే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో త్వరలో వివాహం చేసుకోవాలని అనుకునేవారు.. శుభకార్యాలు నిర్వహించాలని అనుకునేవారు.. ముందే బంగారం కొనుగోలు చేసి పెట్టుకుంటున్నారు. అంతేకాకుండా భవిష్యత్తులో బంగారం దొరుకుతుందో? లేదో? అన్న అనుమానాలతో కూడా కొందరు ఇప్పుడే బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు. అయితే కొందరు బంగారం లిక్విడ్ కొనుగోలు చేసి స్టోర్ చేసుకుంటున్నారు. మరికొందరు ఆన్లైన్ ద్వారా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు.
ఆన్లైన్ ద్వారా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు కొన్ని రకాల టాక్స్లు పే చేయాల్సి ఉంటుంది. దీంతో కొందరు లిక్విడ్ బంగారం కొనుగోలు చేయాలని ఆసక్తి చూపుతారు. అయితే మరికొందరు మాత్రం ఆభరణాలను కొనుగోలు చేస్తున్నారు. భవిష్యత్తులో ఆభరణాలను కొనలేము అని అనుకునేవారు ఇప్పుడే కొనుగోలు చేసి ఇంట్లో దాచుకుంటున్నారు. అయితే కొందరు మహిళలు బంగారం ధరించి బయట తిరుగుతూ ఉంటారు. ఇలాంటివారు కొందరు దొంగల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. ఎందుకంటే ప్రస్తుత సమయంలో డబ్బు కంటే ఎక్కువ విలువైంది బంగారమే. ఈ బంగారం మహిళల మెడలో ఎంతో కొంత ఉంటుంది. కొందరు విచక్షణ రహితంగా బంగారం ను దొంగిలించడానికి ఎంతకైనా తెలుస్తున్నారు. ఇలాంటి సమయంలో బయటకు వెళ్లేటప్పుడు.. ఇంట్లోనూ.. బంగారం విలువ చేసుకునే వారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
అయితే ధరించే వాటికంటే ఎక్కువ బంగారం ఉన్నవారు లాకర్లలో స్టోర్ చేసుకోవాలని.. లేదా బంగారం పై బీమా చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. అవసరం లేకుండా స్థాయికి మించిన బంగారం ధరించకుండా ఉండడమే మేలు అని అంటున్నారు. అలాగే ఇంట్లో ఉన్న బంగారం గురించి బయట ఎక్కడా చర్చించకూడదని.. తమ దగ్గర బంగారం ఎంత ఉందని చెప్పకూడదని అంటున్నారు. బంగారం ఎక్కడ నిల్వ చేసిన విషయం ఇతరులకు తెలియకుండా ఉండడమే మంచిది అని అంటున్నారు.
ఒకవేళ బ్యాంకు లాకర్లలో భద్రపరచాలని అనుకునేవారు సైతం మంచి బ్యాంకులను ఎంచుకోవాలని అంటున్నారు. ఎందుకంటే కొన్ని బ్యాంకులు తక్కువ ధరలకే లాకర్ల అవకాశం ఇస్తామని చెబుతాయి. అలాంటి వాటి గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలని అంటున్నారు.