Bigg Boss 9 Divvela Madhuri: సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో వైరల్ అయిన పేరు దివ్వెల మాధురి(Divvela Madhuri). వైసీపీ మాజీ MLC దువ్వాడ శ్రీనివాస్ సతీమణి గా ఈమె బాగా పాపులర్. ఇప్పుడు ఈమె బిగ్ బాస్ హౌస్(Bigg Boss 9 Telugu) లోకి ఫైర్ స్ట్రోమ్ పేరుతో వైల్డ్ కార్డుగా ఎంట్రీ ఇచ్చింది. రాజకీయ నేపథ్యం నుండి వస్తున్న కంటెస్టెంట్, పైగా చాలా రిచ్, కచ్చితంగా బలుపు, పొగరు చూపిస్తుందేమో అని అంతా అనుకున్నారు. అనుకున్న విధంగానే ఈమె తీరు హౌస్ లో అలాగే కొనసాగుతుంది. మొదటి రోజే కెప్టెన్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తో, దివ్య వంటి వారితో గొడవ పెట్టుకుంది. తన తోటి కంటెస్టెంట్స్ పై అధికారం చలాయించే ప్రయత్నం చేస్తుంది. తనూజ వంటి వారు ఈమెకు భయపడి, స్నేహం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆమె గొంతు పెంచి తనూజ పై అరిచినా కూడా ఆమె తీసుకుంటుంది, ఇలా తనూజ ఒక్కటే కాదు, చాలా మంది కంటెస్టెంట్స్ భయపడుతున్నారు.
పవన్ కళ్యాణ్ ఒక్కడే ఆమెతో ధైర్యం గా గొడవ పెట్టుకున్నాడు అని అనుకుంటే, ఆయన కూడా గొడవ పూర్తి అయిన వెంటనే ఆమెకు క్షమాపణలు చెప్పి కూల్ చేసేస్తాడు. అయితే సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ తో గొడవ పెట్టుకోవడం పై ఫన్నీ మీమ్స్ చాలానే వైరల్ అవుతున్నాయి. ఒక నెటిజెన్ అయితే ‘ఎక్కడున్నా వైసీపీ వాళ్లకు పవన్ కళ్యాణే సరైన మొగుడు’ అంటూ కామెంట్ చేసాడు. ఇది సోషల్ మీడియా లో ఇప్పుడు బాగా వైరల్ అయ్యింది. దివ్వెల మాధురి మరియు ఆమె భర్త దువ్వాడ శ్రీనివాస్ బయట ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ పై ఎన్నో సెటైర్లు వేశారు. దువ్వాడ శ్రీనివాస్ అయితే ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ బొమ్మని చెప్పుతో కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంతెందుకు దివ్వెల మాధురి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టే ముందు కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని గిల్లింది.
పవన్ కళ్యాణ్ కి ఓటు బ్యాంక్ లేదని, నారా లోకేష్ లీడర్ గా తనని తాను నిరూపించుకున్నాడని, టీడీపీ పగ్గాలు త్వరలోనే ఆయన చేతుల్లోకి వెళ్తుంది కాబట్టి, ఆయన ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని చెప్పుకొచ్చింది. ఇది కచ్చితంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని గిల్లినట్టే. రాజకీయంగా భార్యాభర్తలు బయట ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేశారు, ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో కూడా అదే జరుగుతుంది. ఎన్నికలలో పవన్ కళ్యాణ్ పై ఇష్టమొచ్చినట్టు కామెంట్స్ చేసి ఆయన గెలుపుకి ఈ వైసీపీ వాళ్ళు ఎలా అయితే కారణం అయ్యారో, బిగ్ బాస్ హౌస్ లో కూడా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసి ఆయన్ని విన్నర్ ని చేసేలా ఉన్నారంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నిన్న దివ్వెల మాధురి,రమ్య లు పవన్ కళ్యాణ్ ని అమ్మాయిల పిచ్చోడు అంటూ కామెంట్స్ చేయడం ఎంతటి దుమారం రేపిందో మనమంతా చూసాము. అసలే ఓటింగ్ టాప్ ఉన్న పవన్ కళ్యాణ్ ని, దివ్వెల మాధురి ఇలాగే టార్గెట్ చేస్తూ పోతే, కచ్చితంగా ఆయన విన్నర్ అయిపోతాడని విశ్లేషకులు అంటున్నారు.
View this post on Instagram