Maruti car : దేశంలో మారుతి కంపెనీ కార్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. హ్యాచ్ బ్యాక్ నుంచి ప్రీమియం కార్ల వరకు అందించే ఈ కంపెనీ నుంచి ఇప్పటికే కొన్ని మోడళ్లు ఎవర్ గ్రీన్ గా నిలిచాయి. దశాబ్దాలుగా మారుతి కంపెనీకి సంబంధించిన కొన్ని కార్లు సేల్స్ లో అగ్రస్థానంలో ఉంటున్నాయి. వీటిలో వ్యాగన్ ఆర్, స్విప్ట్ తో పాటు స్విప్ట్ డిజైర్ లు ఉన్నాయి. మిగతా కార్లు సైతం కొన్నిసార్లు సేల్స్ ఎక్కువగా నమోదు చేసుకుంటాయి. గత అక్టోబర్ లో మారుతి కంపెనీకి చెందిన ఓ కారు అమ్మకాల్లో మిగతా కార్లను వెనక్కి నెట్టి ముందంజలో ఉంది. ఇది మారుతి నుంచి రిలీజ్ అయ్యే ఎన్నో ఏళ్లు అవుతున్నా.. ఇటీవల వీటి అమ్మకాలు పెరగడంతో షాక్ కు గురవుతున్నారు. ఇంతకీ ఆ కారు ఏదంటే?
పండుగలు, ప్రత్యేక దినాల్లో కొన్ని కంపెనీలు తమ కార్ల సేల్స్ పెంచకునేందుకు ఆఫర్లు ప్రకటిస్తాయి.అలాగే అమ్మకాలు తక్కువగా ఉన్న కార్లపై తగ్గింపు ధరను ప్రకటించడంతో వాటిపై వినియోగదారులు ఎక్కువగా దృష్టి పెడుతారు. ఈ దసరా అమ్మకాల్లో మారుతి కంపెనీకి చెందిన బాలెనో కారు అమ్మకాల్లో దూసుకెళ్లింది. 2024 అక్టోబర్ లో కారు 16,082 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఇదే కారు సెప్టెంబర్ లో 14,292 మంది కొనుగోలు చేశారు. అంటే ఒక్క నెలలోనే ఈ కారు అమ్మకాలు 11.13 శాతం వృద్ధి చెందింది. హ్యాచ్ బ్యాక్ కార్లకు ఎక్కువగా డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో బాలెను ను ఎక్కువగా ఆదరించారు. దీంతో టాటా, హ్యుందాయ్, టయోటా వంటి కార్లను వెనక్కి నెట్టి బాలెనో మందుకు వెళ్లింది.
చిన్న ఫ్యామిలీ కోసం కారు కొనాలని అనుకునేవారికి ఇది అనుగుణంగా ఉంటుంది. ప్రీమియం హ్యాచ్ బ్యాక్ గా గుర్తింపు పొందిన ఈ కారులో ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి. అలాగే ఇందులో పెట్రోల్ తో పాటు సీఎన్ జీ ఆప్షన్లు కూడా ఉన్నాయి. ఈ కారులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ను అమర్చారు. ఇది 90 బీహెచ్ పీ పవర్ తో పాటు 113 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ తో పాటు ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పనిచేసే ఈ కారు సీఎన్ జీ వేరియంట్ లో 77 బీహెచ్ పీ పవర్ తో పాటు 98 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ ఇంజిన్ తో బాలెను లీటర్ కు 22.35 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుండగా.. సీఎన్ జీ వేరియంట్ లో 30.61 కిలోమీటర్ల వరకు వెళ్తుంది.
ప్రస్తుతం బాలెనో కారు మార్కెట్లో రూ.6.66 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. టాప్ ఎండ్ వేరియంట్ రూ.9.83 లక్షలుగా ఉంది. కొత్త బాలెనో డిజైన్ ఆకట్టుకుంటోంది. ఇందులో అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, ఆకట్టుకునే డ్యాష్ బోర్డు ఉన్నాయి. ఇందులో 6 ఎయిర్ బ్యాగ్స్, ఈబీడీ తో కూడాని ఏబీఎస్ ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ , వెనుక సెన్సార్ పార్కింగ్ ఉన్నాయి.