https://oktelugu.com/

ICC Champions Trophy : టీమిండియా అంటే అలా ఉంటుంది మరి.. పాపం పాకిస్తాన్ ఒంటరైపోయింది..

పాకిస్తాన్ పరువు పోయింది. ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించి.. తమ దేశానికి భారత్ ను ఆహ్వానించాలని పాకిస్తాన్ భావించింది. భారత్ వస్తే తమకు దండిగా ఆదాయం వస్తుందని అంచనా వేసింది. అందుకే తమ దేశానికి చెందిన మాజీ క్రికెటర్లతో సానుకూల వ్యాఖ్యలు చేయించింది. గొప్ప ఆతిథ్యం ఇస్తామని నమ్మ బలికింది. కానీ పాకిస్తాన్ ఆశలపై భారత్ నీళ్లు చెల్లింది..

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 30, 2024 / 09:39 AM IST

    ICC Champions Trophy

    Follow us on

    Team India : ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీ టూర్ ను పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో నిర్వహించవద్దని భారత్ డిమాండ్ చేసింది. భారత్ డిమాండ్ ను అర్థం చేసుకున్న icc పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు అల్టిమేటం ఇవ్వడంతో… పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఆ టూర్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.. అంతేకాదు మొదటినుంచి పాకిస్తాన్ దేశంలో ఛాంపియన్స్ ట్రోఫీ లో ఆడబోమని భారత్ పదేపదే స్పష్టం చేస్తూ వస్తోంది. ఆటగాళ్ల భద్రత దృష్ట్యా అక్కడ ఆడేది లేదని అల్టిమేటం ఇచ్చేసింది. కానీ భారత్ తప్పనిసరిగా తమ దేశానికి రావాలని.. కచ్చితంగా ఇక్కడ ఆడాలని పాకిస్తాన్ కోరుతూ వస్తోంది. అంతేకాదు తాము భారత్ లో ఆడుతున్నప్పుడు.. తమ దేశంలో భారత ఆటగాళ్లు పర్యటించడానికి ఇబ్బంది ఏముందని వితండవాదాన్ని తెరపైకి తీసుకువచ్చింది. భారత్ మాట వినే పరిస్థితిలో లేకపోవడంతో.. 2036లో ఒలంపిక్స్ నిర్వహణకు ఇటీవల ఆసక్తి వ్యక్తీకరణను భారత్ ప్రకటించగా.. దానికి మోకాలడ్డుతామని పాకిస్తాన్ హెచ్చరించింది. అయినప్పటికీ పాకిస్తాన్ మాటలను భారత క్రికెట్ బోర్డు పట్టించుకోవడం మానేసింది.. హైబ్రిడ్ మోడ్ విధానంలో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహిస్తేనే తాము ఆ టోర్నీలో ఆడతామని భారత్ స్పష్టం చేసింది.

    ఒకడుగు ముందుకు

    రెండు దేశాల మధ్య ఉన్న పరిస్థితులు.. ఆటగాళ్ల భద్రత.. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని పాకిస్తాన్ దేశంలో ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేది లేదని భారత్ స్పష్టం చేసింది. తమ జట్టు ఆడే మ్యాచ్లు దుబాయ్ వేదికగా నిర్వహించాలని స్పష్టం చేసింది. గత ఆసియా కప్ నిర్వహించినట్టుగానే.. ఛాంపియన్స్ ట్రోఫీలో తమ జట్టు ఆడే మ్యాచ్ లు నిర్వహించాలని భారత్ కోరింది. అయితే ఇప్పుడు భారత్ కోరుతున్న కోరికకు మిగతా క్రికెట్ బోర్డులు సమ్మతం తెలుపుతున్నట్టు తెలుస్తోంది. ఫలితంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఒంటరిగా మారిపోయినట్టు తెలుస్తోంది. హైబ్రిడ్ మోడ్ లో టోర్నీ నిర్వహించడానికి పాకిస్తాన్ ఒప్పుకోవడం లేదు. అయితే పాకిస్తాన్ నిర్ణయాన్ని భారత్ తప్పుపడుతోంది. ఆటగాళ్ల భద్రత దృష్ట్యా హైబ్రిడ్ విధానంలోనే టోర్నీ నిర్వహించాలని కోరుతోంది. హైబ్రిడ్ విధానానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఒప్పుకోకపోవడంతో ఛాంపియన్స్ ట్రోఫీని ఇతర దేశాలలో నిర్వహించాలని ఐసీసీ భావిస్తోంది. ఆమధ్య ఇదే విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు దక్షిణాఫ్రికాలో టోర్నీ నిర్వహించాలని ఐసీసీ భావించినట్టు వార్తలు వచ్చాయి. అయితే దానిపై ఐసీసీ పూర్తిస్థాయిలో స్పష్టత ఇవ్వలేదు. ఇప్పుడు పాకిస్తాన్ హైబ్రిడ్ విధానానికి ఒప్పుకోకపోవడంతో ఇతర దేశాలలో టోర్నీ నిర్వహించే అవకాశాన్ని ఐసీసీ పరిశీలిస్తోంది. ఒకవేళ అదే గనుక వాస్తవరూపం దాల్చితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కోలుకోలేని షాక్ తగిలినట్టే. ప్రపంచ క్రికెట్ బోర్డులు భారత క్రికెట్ బోర్డుకు సమ్మతం తెలుపుతున్న నేపథ్యంలో.. పాకిస్తాన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.