Annuity scheme Details: డబ్బు అవసరం ఈ రోజుల్లో చాలా ఉంది. అయితే ఆదాయానికి మించిన ఖర్చులు ఉండడంతో చాలామంది బ్యాంకు నుంచి రుణం తీసుకుంటూ ఉంటారు. ఇలా తీసుకున్న రుణం EMI ద్వారా చెల్లిస్తారు. అంటే బ్యాంకు నుంచి తీసుకున్న అసలుతో పాటు వడ్డీని కూడా కొంత కలిపి నెలనెలా బ్యాంకుకు చెల్లిస్తారు. కానీ ఇప్పుడు బ్యాంకులే ఖాతాదారులకు నెలనెలా ఈఎంఐ ద్వారా చెల్లించే అవకాశం ఉంది. వినడానికి విచిత్రంగా ఉన్న ఇది నిజం. అదనపు ఆదాయం కోసం చూసేవారి కోసం కొత్తగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. దీని ద్వారా ఖాతాదారులు నెలనెలా EMI ని పొందవచ్చు. మరి దీని గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా..? అయితే ఈ వివరాల్లోకి వెళ్ళండి..
సాధారణంగా బ్యాంకులో నిర్ణీత కాలం పాటు డిపాజిట్ చేస్తే దీనిపై వడ్డీ వస్తుంది. కొంతకాలం తర్వాత అసలుతో కలిపి వడ్డీని చెల్లిస్తారు. అయితే దీనికి భిన్నంగా యాన్యుటి అనే పథకం అందుబాటులోకి వచ్చింది. ఈ పథకం ద్వారా ఒకేసారి డబ్బులు డిపాజిట్ చేసి.. నెల నెల రూపంలో వడ్డీతో కలిపి స్వీకరించి అవకాశం ఉంటుంది. అయితే అది ఎంచుకునే డిపాజిట్ ని బట్టి వడ్డీ ఉంటుంది.
ఈ డిపాజిట్ పథకంలో 5,7,10 సంవత్సరాల కాల వ్యవధి ఉంటుంది. ఆయా సంవత్సరాలు ఇందులో డిపాజిట్ చేయాలి. అయితే మనం కోరుకున్న విధంగా నెలనెలా బ్యాంకులు సంబంధిత వ్యక్తులు లేదా వ్యక్తులకు సంబంధించిన నామినీలకు ఈఎంఐ ని చెల్లిస్తారు. రిటైర్మెంట్ అయిన వారు తమకు వచ్చిన మొత్తాన్ని ఇలాంటి డిపాజిట్ చేసి నెలనెలా వారి ఖర్చుల కోసం తీసుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల వడ్డీతో పాటు అసలు కూడా చేతికి వచ్చి ఖర్చులకు ఉపయోగపడతాయి. దీంతో వారి కుమారులు లేదా కుమార్తెలపై ఆర్థిక భారం పడకుండా ఉంటుంది.
Also Read: SIP Monthly Investment: ఈ సీక్రెట్ తెలుసుకుంటే రూ.10,000లతో కోటీశ్వరులు కావొచ్చు
అయితే చాలామంది ఒకే మొత్తంలో డబ్బు రావడంతో వాటిని బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు. ఇలా చేయడం వల్ల కొంతకాలం పాటు డబ్బు లాక్ అయిపోతుంది. కానీ రిటైర్మెంట్ అయిన వారి అవసరాలు తీరడానికి కష్టం అవుతుంది. అంతేకాకుండా వారి కుమారులపై ఆర్థిక భారం పడుతుంది. ఇలాంటి పరిస్థితిని గమనించిన బ్యాంకులు యాన్యుటి పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో ఎంతో ఉపయోగంగా ఉండే అవకాశం ఉందని కొందరు అంటున్నారు.
అయితే ఇది కేవలం రిటైర్మెంట్ అయిన వారు.. లేదా ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు వచ్చిన వారికి మాత్రమే ఉపయోగకరంగా ఉంటుంది. ఇతర ఆర్థిక అవసరాలతో పాటు ఉద్యోగులకు కష్టంగానే ఉంటుంది. ఇది కేవలం రిటైర్మెంట్ అయిన వారికి మాత్రమే కాకుండా వారి పేరు మీద డబ్బు తీసుకున్న వారు కూడా డిపాజిట్ చేసి నెలనెలా ఖర్చులకోసం emi ని పొందవచ్చు. అయితే వడ్డీ రేటు ఎలా ఉంటుంది? అనేది మాత్రం బ్యాంకును సంప్రదించిన తర్వాతనే నిర్ణయించుకోవాలి. ఎందుకంటే ఇలాంటి స్కీం లో వడ్డీ శాతం తక్కువగా ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా అన్ని బ్యాంకులు ఈ పథకం లేదు. దీనిపై ఆసక్తి ఉన్నవారు సమీప బ్యాంకుల్లో సంప్రదించాలి.