దుబ్బాకలో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. ఇందులో టీఆర్ఎస్ ఆధిక్యత సాధించింది. మొత్తం 1453 ఓట్లలో టీఆర్ఎస్ ముందంజలో ఉంది. ఈవీఎంలలో లెక్కించిన ఓట్ల ప్రకారం మొదటి రౌండ్లో 341ఓట్లతో బీజేపీ ఆధిక్యం సాధించింది. ఇందులోబీజేపీకి 3,208, టీఆర్ఎస్కు 2,867, కాంగ్రెస్ కు 648 ఓట్లు వచ్చాయి. ఉదయం 9 గంటలకు మొత్తం 7,446 ఓట్లను లెక్కించారు. మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. పొన్నాల ఇందూరు కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో అధికారులు 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఈనెల 3న 315 పోలింగ్ కేంద్రాల్లో 1,64,186 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 82.61 శాతం పోలింగ్ నమోదైంది.