Andhadun movie : 32 కోట్లతో తీస్తే 440 కోట్లు వచ్చాయి.. అసలేంటి మూవీ.. ఏముంది ఇందులో?

Andhadun movie : ఈ మూవీలో ఆయుష్మాన్ ఎంతలా యాక్టింగ్ చేశాడంటే.. నేషనల్ అవార్డు సైతం వెతుక్కుంటూ వచ్చేంతగా.. ఈ మూవీ బడ్జెట్ కేవలం రూ.32 కోట్లు మాత్రమే. అయితే, ఫైనల్ రన్‌లో మాత్రం రూ.440 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది.

Written By: NARESH, Updated On : June 28, 2024 10:13 pm

Andhadun movie

Follow us on

Andhadun movie : సినిమాల్లో థ్రిల్లర్ జానర్ కు ఫాన్స్ ఎక్కువగా ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతీ సన్నివేశం ఒక సస్పెన్స్ క్రియేట్, ఎగ్జియిటింగ్ క్రియేట్ చేస్తూ సాగే మూవీ చూస్తూ కుర్చీకి అతుక్కుపోయేందుకే ఎక్కువ మంది ఇష్టపడతారు. ఇలాంటి సినిమాలకు ఆద్యుడు ఆల్ఫ్రిడ్ హిచ్‌కాక్. ఆయన దర్శకత్వంలో సినిమా చూడడం ప్రారంభిస్తే చాలు.. పూర్తయ్యే వరకు కుర్చీ నుంచి కనీసం కదలడం కూడా కుదరదు. అంతలా ఎంగేజ్ చేస్తాయి.

ప్రతీ ఏటా ఇలాంటి జానర్‌లో కుప్ప తెప్పలుగా సినిమాలు వస్తూనే ఉంటాయి. అయితే, అన్నీ ఎగ్జయిట్‌మెంట్ చేసేలా ఉండవు. ఈ మధ్య కాలంలో సీట్ ఎడ్జ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ రావడం కనుమరుగైంది. ఎప్పుడో పుష్కరానికి ఒకటి చొప్పున వస్తున్నాయి.

అలాగే ఆరేళ్ల కిందట వచ్చిన ఒక సినిమా సంచలనం అనే మాటను కూడా దాటేసింది. ఆ సినిమా పేరు.. ‘అంధాదున్’. హిందీలో వచ్చిన సినిమాల్లో ది బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్. IMBD కూడా ఈ మూవీకి 8.2 రేటింగ్ ఇచ్చిందంటే ఏ రేంజ్‌లో ఆడియన్స్ ను ఎంగేజ్ చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

శ్రీరాం రాఘవ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మాస్టర్ పీస్ అనే చెప్పాలి. ఈ మూవీలో హీరోగా ఆయుష్మాన్ ఖురానా నటించారు. ఈ ఒక్క సినిమాతో ఆయుష్మాన్‌ ఓవర్‌ నైట్ పాపులారిటీ సంపాదించుకున్నారు.

ఇందులో ఆయుష్మాన్ గుడ్డివాడిగా నటించాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే? అతను నిజంగా గుడ్డివాడు కాదు.. జస్ట్ కొన్ని నెలలు అలా నటించాలని అనుకుంటాడు. కానీ ఒక ఇన్సిడెంట్ తో కంటిన్యూ చేయాల్సి వస్తుంది.

ఈ మూవీలో ఆయుష్మాన్ ఎంతలా యాక్టింగ్ చేశాడంటే.. నేషనల్ అవార్డు సైతం వెతుక్కుంటూ వచ్చేంతగా.. ఈ మూవీ బడ్జెట్ కేవలం రూ.32 కోట్లు మాత్రమే. అయితే, ఫైనల్ రన్‌లో మాత్రం రూ.440 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది.

ఇక, ఈ మూవీని టాలీవుడ్ లో నితిన్ హీరోగా ‘మ్యాస్ట్రో’ పేరుతో రీమేక్ చేశాడు. నభా నటాషా హీరోయిన్‌గా నటించింది. తమన్నా కూడా కీలక రోల్ చేసింది. అయితే, కొవిడ్ కారణంగా నేరుగా ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమాకు ఆడియెన్స్ ను ఆకట్టుకోలేకపోయింది. ఈ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు.