https://oktelugu.com/

Pancard : ఉన్న వారికి అలర్ట్.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

ఒకప్పుడు ఆర్థిక లావాదేవీలు మాన్యువల్ నిర్వహించేవారు. దీంతో ఎంత డబ్బు చేతులు మారుతుందో తెలిసేది కాదు. కానీ టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో బ్యాంకింగ్ సెక్టార్ లో కొన్ని కొత్త పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి.

Written By:
  • Srinivas
  • , Updated On : November 27, 2024 / 11:05 AM IST

    Pancard

    Follow us on

    Pancard : ఒకప్పుడు ఆర్థిక లావాదేవీలు మాన్యువల్ నిర్వహించేవారు. దీంతో ఎంత డబ్బు చేతులు మారుతుందో తెలిసేది కాదు. కానీ టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో బ్యాంకింగ్ సెక్టార్ లో కొన్ని కొత్త పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా మనీ ట్రాన్స్ ఫర్ ను ఆన్ లైన్ లేదా డిజిటల్ మధ్యమాల ద్వారా చెల్లిస్తున్నారు. వీటికి తోడు రూ.50 వేల కంటే ఎక్కువగా ట్రాన్జాక్షన్ జరిపితే Parmanent Account Number(PAN)నెంబర్ తప్పనిసరిగా చేర్చాలని అంటున్నారు. నగదు లావాదేవీల్లో మాత్రమే కాకుండా కొన్ని ముఖ్యమైన పనుల్లో ఆధార్ కార్డుతో సహా పాన్ కార్డును ఇవ్వాలని అంటున్నారు. అయితే చాలా మంది పాన్ కార్డులు అప్డేట్ కాలేదు. దీంతో తాజాగా కేంద్ర ప్రభుత్వం కొత్త కార్యక్రమాన్ని చేపట్టింది. పాత పాన్ కార్డుల స్థానంలో క్యూ ఆర్ కోడ్ ఉన్న పాన్ కార్డులు తీసుకోవాలని తెలుపుతోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభించింది. అయితే పాన్ కార్డు 2.0 గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..

    భారత ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. ఒక వ్యక్తి ఆదాయ వివరాలు ప్రభుత్వానికి పాన్ కార్డు ద్వారా తెలుస్తుంది. అందువల్ల ప్రతీ ఆర్థిక వ్యవహారాల్లో పాన్ కార్డును తప్పనిసరి చేస్తున్నారు. విద్యార్థుల నుంచి ఉద్యోగులు, వ్యాపారులు పాన్ కార్డును కలిగి ఉన్నారు. గతంలో దీని అప్డేట్ కోసం ఆధార్ తో లిం క్ చేయాలనే ప్రోగ్రామ్ ను నిర్వహించారు. ఇప్పుడు పాన్ కార్డును అప్డేట్ చేసుకోవాలని కేంద్ర కేబినేట్ తెలిపింది. ఇందులో భాగంగా తాజాగా నిర్వహించిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుత పాన్ కార్డులన్నీ రద్దు చేసి వాటి స్థానంలో కొత్త కార్డులను ఇవ్వాలని చూస్తోంది. కొత్త కార్డుల్లో క్యూఆర్ కోడ్ ను ప్రవేశపెట్టారు. దీనిన స్కాన్ చేస్తే వ్యక్తి వివరాలు వెంటనే తెలిసిపోతాయి.

    పాత కార్టుల స్థానంలో కొత్త కార్డుల మార్పునకు ప్రభుత్వం రూ.1435 కోట్ల నిధులు కేటాయించింది. వ్యక్తులు పాత కార్డు స్థానంలో కొత్త కార్డులను ఉచితంగానే మార్చుకోవచ్చు. ఇందుకు ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు. రెగ్యులర్ గా ఆదాయపు పన్ను చెల్లించేవారికి పాన్ కార్డు 2.0 ద్వారా మెరుగైన అనుభవాన్నిపొందే అవకాశం ఉంటుంది. అంటే పాన్ కార్డు ద్వారా కొన్ని చెల్లింపులు సులభతరం అవుతాయి. అలాగే పాన్ కార్డు ద్వారా రిజిస్ట్రేషన్ సేవలను ఏకీకృతం చేయనున్నారు.

    దేశంలో ప్రస్తుతం 78 కోట్ల పాన్ కార్డులు ఉన్నాయి. కొత్త ప్రాజెక్టు ద్వారా వీటిని అప్డేట్ చేయనున్నామని కేంద్ర మంత్రి అశ్వినీ జైషీ తెలిపారు. ఒక వ్యక్తి గుర్తింపు కోసం ఆధార్ తో పాటు పాన్ కార్డు కూడా ప్రధానంగా మారింది. దీని ద్వారా ఆ వ్యక్తికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు తెలిసిపోతాయి.అయితే ఇటీవల ఈ పాన్ కార్డుల ఆధారంగా సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. ఇందుకు కారణం పాన్ కార్డు అప్టేట్ కాకపోవడమేనన్న వాదనలు వినిపించాయి. ఈ నేపథ్యంలో వీటిని అప్టేట్ చేయడం ద్వారా నకిలీవి గుర్తించి అసలైన వారికి కొత్త కార్డులను అందజేయనున్నారు.