ఎయిర్ టెల్ కస్టమర్లకు శుభవార్త.. ఉచితంగా రీఛార్జ్..?

ప్రముఖ టెలీకాం సంస్థలలో ఒకటైన ఎయిర్ టెల్ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. 5 కోట్ల 50 లక్షల మంది కస్టమర్లకు ప్రయోజనం చేకూరే విధంగా కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్ టెల్ కస్టమర్లు ఒకసారి ఉచితంగా 49 రూపాయల ప్లాన్ ను రీఛార్జ్ చేసుకునే అవకాశాన్ని ఎయిర్ టెల్ కల్పిస్తోంది. అల్ప ఆదాయ వర్గాలకు చెందిన వాళ్లకు ఈ బెనిఫిట్ ను పొందే అవకాశాన్ని ఎయిర్ టెల్ కల్పిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ వల్ల విపత్కర […]

Written By: Navya, Updated On : May 16, 2021 6:41 pm
Follow us on

ప్రముఖ టెలీకాం సంస్థలలో ఒకటైన ఎయిర్ టెల్ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. 5 కోట్ల 50 లక్షల మంది కస్టమర్లకు ప్రయోజనం చేకూరే విధంగా కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్ టెల్ కస్టమర్లు ఒకసారి ఉచితంగా 49 రూపాయల ప్లాన్ ను రీఛార్జ్ చేసుకునే అవకాశాన్ని ఎయిర్ టెల్ కల్పిస్తోంది. అల్ప ఆదాయ వర్గాలకు చెందిన వాళ్లకు ఈ బెనిఫిట్ ను పొందే అవకాశాన్ని ఎయిర్ టెల్ కల్పిస్తోంది.

కరోనా సెకండ్ వేవ్ వల్ల విపత్కర పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో ఎయిర్ టెల్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ నిర్ణయంతో పాటు 79 రూపాయల ప్లాన్ ను రీఛార్జ్ చేసుకునే కస్టమర్లకు రెట్టింపు బెనిఫిట్స్ ను పొందే అవకాశం ఉంటుంది. ఎయిర్ టెల్ తీసుకున్న నిర్ణయం విలువ 270 కోట్ల రూపాయలు అని సమాచారం. ఉచితంగా పొందే 49 రూపాయల ప్యాక్ వల్ల ఎయిర్ టెల్ కస్టమర్లు 100 ఎంబీ డేటాతో పాటు 38 రూపాయల టాక్ టైమ్ పొందవచ్చు.

గ్రామీణ ప్రాంతాల్లోని ఎయిర్ టెల్ వినియోగదారులకు లబ్ధి చేకూర్చడం కొరకు ఎయిర్ టెల్ ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఎయిర్ టెల్ సంస్థకు దేశవ్యాప్తంగా 34 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. ఎయిర్ టెల్ ఈ ప్రయోజనాలను వారం రోజుల్లో కస్టమర్లు పొందవచ్చని వెల్లడించింది. ఎయిర్ టెల్ తీసుకున్న నిర్ణయం పట్ల కస్టమర్లు హర్షం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

ఎయిర్ టెల్ కస్టమర్లు సమీపంలోని ఎయిర్ టెల్ స్టోర్ ను సంప్రదించి ఈ ఆఫర్ కు సంబంధించిన పూర్తి వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. ఎయిర్ టెల్ లా ఇతర టెలీకాం కంపెనీలు కూడా కస్టమర్లకు ప్రయోజనం చేకూరేలా ఆఫర్లను ప్రకటిస్తాయేమో చూడాల్సి ఉంది.