
మేడ్చల్ జిల్లాలో విషాద ఘటన జరిగింది. క్వారీ గుంతోకి దూకి ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది, జగద్గిరిగుట్ట పరిధిలోని బాలయ్యనగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితులు ఎల్లమ్మబండ నగర్ కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. రెండు రోజుల క్రితం ప్రేమికులిద్దరూ ఇంట్లో నుంచి అదృశ్యమయ్యారు. తల్లిదండ్రులు వీరి ఆచూకీ కోసం ప్రయత్నిస్తుండగా ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసి విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.