బ్యాంక్ అకౌంట్ రూ.12 ఉన్నాయా.. లేదంటే రూ.2 లక్షలు నష్టం..?

కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం అమలు చేస్తున్న స్కీమ్స్ లో ప్రజలకు ప్రయోజనం చేకూర్చే స్కీమ్స్ ఎన్నో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీమ్ లలో ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన పథకం ఒకటి. ఈ స్కీమ్ లో చేరితే సంవత్సరానికి రూ.12 చెల్లించడం ద్వారా రూ.2 లక్షల ఇన్సూరెన్స్ పొందే అవకాశం ఉంటుంది. యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ స్కీమ్ అయిన ఈ […]

Written By: Navya, Updated On : May 16, 2021 6:45 pm
Follow us on

కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం అమలు చేస్తున్న స్కీమ్స్ లో ప్రజలకు ప్రయోజనం చేకూర్చే స్కీమ్స్ ఎన్నో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీమ్ లలో ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన పథకం ఒకటి. ఈ స్కీమ్ లో చేరితే సంవత్సరానికి రూ.12 చెల్లించడం ద్వారా రూ.2 లక్షల ఇన్సూరెన్స్ పొందే అవకాశం ఉంటుంది.

యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ స్కీమ్ అయిన ఈ స్కీమ్ ద్వారా పేద ప్రజలకు ప్రయోజనం చేకూరనుంది. సంవత్సరానికి రూ.12 చెల్లించడం ద్వారా రూ.2 లక్షల ఇన్సూరెన్స్ వస్తుంది. ఈ స్కీమ్ లో చేరిన వాళ్లు ప్రమాదవశాత్తూ యాక్సిడెంట్ లో మరణిస్తే ఈ స్కీమ్ ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది. యాక్సిడెంట్ లో అంగ వైకల్యం సంభవిస్తే రూ.లక్ష నుంచి రూ.2 లక్షలు పొందే అవకాశం ఉంటుంది.

ఇప్పటికే ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్ల ఖాతాల నుంచి ఈ నెలలో 12 రూపాయలు కట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఖాతాలో రూ.12 లేకపోతే ఈ స్కీమ్ కు అర్హత పొందడం సాధ్యం కాదు. 18 నుంచి 70 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 1 నుంచి మే 31 వరకు ఈ పాలసీ వర్తిస్తుంది.

ఖాతాలో నగదు లేని వాళ్లు ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిది. కేంద్ర ప్రభుత్వం దేశంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వాళ్లకు ప్రయోజనం చేకూర్చడం కొరకు ఈ తరహా స్కీమ్స్ ను అమలు చేస్తోంది.