Mahesh babu and Rajamouli : సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu), రాజమౌళి(SS Rajamouli) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా గురించి రోజుకు ఒక ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియా లో లీక్ అవుతూ బాగా వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన వీడియో ఒకటి లీక్ అవ్వడంతో ఎవరికీ తోచినట్టు వాళ్ళు ఆ లీక్ వీడియో ని ఆధారంగా చేసుకొని కథలు అల్లేస్తున్నారు. ఫారెస్ట్ అడ్వెంచర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా లో సైన్స్ ఫిక్షన్ కూడా జత కలిసిందని కొందరు నేడు ఒకరు ప్రచారాన్ని వైరల్ చేసారు. సైన్స్ ఫిక్షన్ ఉందో లేదో తెలియదు కానీ, ఈ సినిమాని రాజమౌళి రామాయణంలోని ఒక ఘటనని ఆధారంగా తీసుకొని స్క్రిప్ట్ ని సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. లక్షణుడు యుద్ధ సమయంలో స్పృహ తప్పి పడిపోగా, ఆంజనేయస్వామి పారిజాత పుష్పాలను తీసుకొని రమ్మంటే, ఏకంగా ఆ పారిజాత పుష్పాలు ఉన్న కొండని తీసుకొచ్చేస్తాడు.
Also Read : వందల సంవత్సరాలు వెనక్కి..మహేష్ – రాజమౌళి మూవీ పూర్తి స్టోరీ వింటే మీ రోమాలు నిక్కపొడుచుకుంటాయి!
ఆ లైన్ మీదనే ఈ సినిమా స్క్రిప్ట్ ని సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. ఒక పెద్ద శాస్త్రవేత్తకు ఒక సంఘటన కారణంగా తన కాళ్ళు, చేతులు, వెన్నుముక పనిచేయకుండా పోతాయి. జీవితాంతం అతను వీల్ చైర్ కి పరిమితం కావాల్సిన పరిస్థితి. ప్రపంచం లో ఉన్న ఎంత మంది డాక్టర్లకు చూపించిన అతనికి నయం అవ్వదు. అయితే ఆ శాస్త్రవేత్తకు దట్టమైన అడవి లో దొరికే కొన్ని మూలికల ద్వారా నయం చేయవచ్చని, వాటిని తీసుకొని వస్తే దాని ద్వారా నిన్ను మామూలు మనిషిని చేయొచ్చని ఒక డాక్టర్ చెప్తాడు. కానీ ఆ మూలికలు సామాన్య మనుషులు తీసుకొని రాలేరు. ఎన్నో క్రూరమైన మృగాలు, విష సర్పాలు వంటివి ఉంటాయి. చిన్నప్పటి నుండి అడవిలో పెరిగిన మనుషులు, అడవిలో ప్రతీ అంగుళం పట్ల అవగాహనా ఉంటూ, క్రూర జంతువులతో పోరాడే సత్తా ఉన్న మనుషులు మాత్రమే అక్కడికి వెళ్ళగలరు.
అలాంటి సత్తా ఉన్న మనిషి మన హీరో మహేష్ బాబు. ఇతని గురించి వెతికి వెతికి చివరకు అతను దొరికిన తర్వాత కిడ్నాప్ చేసి శాస్త్రవేత్త వద్దకు తీసుకొస్తారు. అలా తీసుకొచ్చిన హీరో తో డీల్ పెట్టుకొని, తనకు అవసరమైన మూలికలను సాధించే ప్రయత్నం చేస్తాడు. హీరో కూడా అంత తేలికగా డీల్ ఒప్పుకునే వ్యక్తి కాదు, తనకు తన ఊరి ప్రజలకు మంచి జరిగే కార్యక్రమం బదులుగా ఉంటేనే అతను డీల్ ఒప్పుకుంటాడు. ఉంది కాబట్టి డీల్ కి ఒప్పుకోని బయలుదేరుతాడు. ఈ ప్రయాణం లో హీరోకి ఎదురయ్యే అనుభవాలే సినిమా. అసలు శాస్త్రవేత్తకు ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చింది?, అందుకు తగిన బ్యాక్ స్టోరీ కూడా అద్భుతంగా ఉంటుందని తెలుస్తుంది. ఫారెస్ట్ లో జరిగే అడ్వెంచర్ ప్రయాణం చూసే ఆడియన్స్ కి రోమాలు నిక్కపొడుచుకొని రేంజ్ లో ఉంటాయట.
Also Read : అడ్వెంచర్ మాత్రమే కాదు..సైన్స్ ఫిక్షన్ కూడా..రాజమౌళి, మహేష్ సినిమా గురించి సంచలన అప్డేట్!