కేంద్రప్రభుత్వ ‘రూర్బన్’ పథకం సక్సెస్ కథ

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అమలు చేస్తున్న ‘శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ పథకం’ మారుమూల గ్రామాల రూపురేఖలు మారుస్తోంది. ఈ పథకం గిరిజన గ్రామాలకు వరంగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ స్థాయి మౌలిక సుదుపాయాలు, ఆధునిక హంగులు కల్పించడానికి ఈ రూర్బన్ పథకాన్ని చేపట్టారు. తొలిదశలో 2016లో పైలెట్ ప్రాజెక్ట్ కింద వివిధ రాష్ట్రాల్లోని పలు క్లస్టర్లను కేంద్రం ఎంపిక చేసింది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని గిరిజన నారాయణ ఖేడ్ మండలాన్ని ఎంచుకుంది. ఇక […]

Written By: NARESH, Updated On : July 29, 2021 9:48 am
Follow us on

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అమలు చేస్తున్న ‘శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ పథకం’ మారుమూల గ్రామాల రూపురేఖలు మారుస్తోంది. ఈ పథకం గిరిజన గ్రామాలకు వరంగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ స్థాయి మౌలిక సుదుపాయాలు, ఆధునిక హంగులు కల్పించడానికి ఈ రూర్బన్ పథకాన్ని చేపట్టారు. తొలిదశలో 2016లో పైలెట్ ప్రాజెక్ట్ కింద వివిధ రాష్ట్రాల్లోని పలు క్లస్టర్లను కేంద్రం ఎంపిక చేసింది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని గిరిజన నారాయణ ఖేడ్ మండలాన్ని ఎంచుకుంది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ లోని కుంటాల మండలం కల్లూరు గ్రామాన్ని ఎంపిక చేసింది. దీని ప్రకారం నాలుగేళ్లలో నిధులు మంజూరై గ్రామాల రూపు రేఖలే మారిపోయాయి. దాదాపు 14 ప్రధాన గ్రామీణ లక్ష్యాలు నెరవేర్చే మోడీ ప్రవేశపెట్టిన ఈ పథకంలో రూపురేఖలు మారిన కల్లూరు గ్రామ కథ ఇప్పుడు జాతీయ దృష్టిని ఆకర్షించింది. ఆ ఊరి కథ గురించి తెలుసుకుందాం..

నిర్మల్ జిల్లా కుంటాల మండలం కల్లూరు గ్రామం అభివృద్ధికి ఆలవాలంగా నిలుస్తోంది. ఈ గ్రామం అభినవ షిరిడీగా పేరు పొందింది. ఇక్కడి సాయిబాబా ఆలయం ఎంతో ప్రత్యేకత కలిగింది. ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చి దర్శించుకుంటారు. స్వామిని తమ కులదైవంగా భావిస్తారు. అభినవ షిరీడీ పేరొందిన కల్లూరు అదే స్థాయిలో ‘అభివృద్ధి’లో నేతలు, అధికారుల తోడ్పాటుతో దూసుకెళుతోంది.

కల్లూరు గ్రామ అభివృద్ధిలో అధికార పాలకవర్గాలు, గ్రామ వీడీసీ,గ్రామస్థులందరూ ఒక్కతాటిపైకి వచ్చి సహాయ సహకారాలు అందించడంతో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా అభివృద్ధి పథంలో ఇది దూసుకెళుతోంది. ఆ దిశగా అడుగులు వేస్తోంది. వీరందరికీ తోడుగా ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావ్, నేతలు, గ్రామస్థులందరూ తమ సహాయ సహకారాలు అందించడంతో గ్రామ అభివృద్ధి పథంలో సాగుతోంది.

కేంద్ర ప్రభుత్వం గిరజన గ్రామాల రూపురేఖలు మార్చేందుకు  ‘రూర్బన్ పథకం’ తెచ్చింది. కేంద్రం ప్రవేశపెట్టిన ఈ పథకంలో గ్రామంలో సుందరమైన పార్క్ ను ఏర్పాటు చేశారు. కూరగాయల విక్రయదారుల కోసం కూరగాయల షెడ్డూ ఏర్పాటు చేశారు. గ్రామస్థుల ఆన్ లైన్ సర్వీసులు కల్పించేందుకు సిటిజన్ సర్వీస్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు ఉపాధి కల్పించేందుకు విస్తరాకులు తయారు చేసేందుకు షెడ్డూను ఏర్పాటు చేశారు.

ఇక ఉల్లాసం కోసం కూడా గ్రామస్థులకు వసతులు కల్పించారు. కల్లూరు గ్రామంలోని సాయిబాబా టెంపుల్ ప్రజలకు ధ్యానం చేసుకునేందుకు ఒక మందిరం కూడా నిర్మించారు. ఈ రూర్ బన్ పథకంలోని నిధులతో గ్రామంలోని పాఠశాలలో విద్యార్థుల సౌకర్యం కోసం స్మార్ట్ క్లాస్ ఏర్పాటు చేశారు. ఇక దాంతోపాటు అంగన్ వాడీ కేంద్రాన్ని అన్ని వసతులతో కల్పించారు. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ రూర్ బన్ పథకంలో నిధులతోనే జరగడం విశేషం.

ఇవే కాదు.. గ్రామంలోని ఒడ్డెర కాలనీ ఇన్నాళ్లు చీకటి మయంగా ఉండగా.. విద్యుత్ స్తంభాలు, విద్యుత్ వైర్లను ఏర్పాటు చేసి వారికి వెలుగులు పంచారు.ఇక న్యూ కాలనీలో సీసీ రోడ్లు, డ్రైన్లు ఏర్పాటు చేసి పారిశుధ్య సమస్యలను తీర్చారు. గ్రామానికి ఆనుకొని ఉన్న జాతీయ రహదారి మార్గంలో సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేయించారు. కుంటాల రోడ్డు మార్గంలో సైడ్ లైట్ల సిస్టంను ఏర్పాటు చేసి పాదచారులు, వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చేశారు.ఈ సెంట్రల్, సైడ్ లైటింగ్ తో గ్రామం రాత్రిపూట జిగేల్ మని వెలుగోందుతోంది. దీంతో కొత్త శోభను సంతరించుకుంది.

ఇక ఉపాధి హామీ నిధులతో సాయిబాబా ఆలయానికి వెళ్లే రోడ్డును సుందరంగా నిర్మించి భక్తుల కష్టాలు తీర్చారు. రైతుల సమావేశం కోసం రైతు వేదికను ఏర్పాటు చేసి వారికి సలహాలు సూచనలను అందులో అందిస్తున్నారు. ఇక గ్రామంలోని జనం అస్వాదించేందుకు ‘పల్లె ప్రకృతి’ వనం ఏర్పాటు చేశారు. వైకుంఠధామాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇక పారిశుధ్య లోపాన్ని సవరించేందుకు చెత్త సేకరణ షెడ్డును కూడా గ్రామంలో ఏర్పాటు చేశారు.

ఇక జీపీ నిధులతో న్యూ కాలనీలో సీసీ రోడ్లు ఏర్పాటు చేసి అభివృద్ధికి బాటలు వేశారు. గ్రామం నుంచి బస్టాండ్ వరకు మురికి కాలువలను నిర్మించి మురికినీటి సమస్యను తీర్చేశారు. ఇక గ్రామ యువకులు పాఠశాలలో ఒక ప్లే గ్రౌండ్ ను తయారు చేసి ఆటలకు అనుగుణంగా మలిచారు.

ఇన్నాళ్లు అంతంతగా అభివృద్ధికి నోచుకోని కల్లూరు గ్రామం ఇప్పుడు ఈ కొత్త పాలకవర్గం రాకతో అభివృద్ధిలో దూసుకుపోతోంది. ఒక సంవత్సరంలోనే గ్రామ రూపురేఖలు మారిపోయాయి. హరిత హారం సక్సెస్ అయ్యింది. ప్రభుత్వ పథకాలన్నీ ఇక్కడ దిగ్విజయంగా నడుస్తున్నాయి.

ఎంపీ ఎమ్మెల్యే, ఎంపీపీలు, వైఎస్ ఎంపీపీల మిగతా ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థుల సహకారంతోనే ఈ అభివృద్ధి సాధ్యమైందని గ్రామసర్పంచ్ వినమ్రంగా చెబుతున్నాడు. ఎంపీ నిధులతో జరిగిన ఈ అభివృద్ధితో గ్రామ రూపురేఖలు మారాయని చెబుతున్నారు.