Air Coolers :వేసవిలో చల్లటి గాలి కావాలి, కానీ బడ్జెట్ తక్కువగా ఉందా? అయితే టెన్షన్ అవసరం లేదు. రూ. 5000 లోపు బడ్జెట్‌లో ఏయే కంపెనీల ఎయిర్ కూలర్లు లభిస్తాయో, అవి వేడిని తరిమికొట్టి చల్లటి గాలిని అందించడంలో ఎలా సహాయపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ధరల శ్రేణిలో బజాజ్, కెన్‌స్టార్, థామ్సన్, హావెల్స్, హిండ్‌వేర్ వంటి కంపెనీల ఎయిర్ కూలర్లు లభిస్తాయి.
Also Read : ఏసీ, కూలర్ కు బదులు ఇలా చేయండి. ఇల్లు చల్లగా ఉంటుంది
బజాజ్ రూమ్ ఎయిర్ కూలర్
ఫ్లిప్‌కార్ట్‌లో బజాజ్ కంపెనీకి చెందిన 24 లీటర్ల ఎయిర్ కూలర్ 32 శాతం తగ్గింపుతో 4,999 రూపాయలకు లభిస్తోంది. ఈ కూలర్‌తో కంపెనీ సంవత్సరం స్టాండర్డ్ వారంటీ, 2 సంవత్సరాల ఎక్స్ టెండెడ్ వారంటీని ఉచితంగా అందిస్తోంది.
థామ్సన్ కూలర్
ఫ్లిప్‌కార్ట్‌లో 40 లీటర్ల స్టోరేజ్ ట్యాంక్ కలిగిన ఈ థామ్సన్ ఎయిర్ కూలర్ 33 శాతం తగ్గింపుతో 4,999 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఈ కూలర్ ప్రత్యేకత ఏమిటంటే, ఇది ఇన్వర్టర్ అనుకూలమైనది. అంటే, ఇది ఇన్వర్టర్‌పై కూడా సులభంగా పనిచేస్తుంది. దీనితో పాటు పవర్ ఫుల్ మోటార్ కలిగిన ఈ కూలర్‌లో తేనెగూడు ప్యాడ్(Honeycomb pads)లు, చక్రాలు ఉన్నాయి. వీటి సహాయంతో కూలర్‌ను సులభంగా తరలించవచ్చు.
కెన్‌స్టార్ కూలర్
ఫ్లిప్‌కార్ట్‌లో 27 లీటర్ల స్టోరేజ్ కలిగిన ఈ ఎయిర్ కూలర్ 55 శాతం తగ్గింపుతో 4,399 రూపాయలకు విక్రయిస్తున్నారు. సంవత్సరం మ్యాను ఫ్యాక్ఛరింగ్ వారంటీతో వచ్చే ఈ కూలర్‌లో తేనెగూడు ప్యాడ్‌లు(Honeycomb pads), 12 అంగుళాల పెద్ద, పవర్ పుల్ ఫ్యాన్, హెవీ డ్యూటీ మోటార్ ఉన్నాయి.
హిండ్‌వేర్ కూలర్ ధర
అమెజాన్‌లో 25 లీటర్ల ఈ ఎయిర్ కూలర్ 48 శాతం తగ్గింపుతో 4,699 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఇన్వర్టర్ అనుకూలత, ఐస్ ఛాంబర్, తేనెగూడు ప్యాడ్‌తో వచ్చే ఈ కూలర్ మోటార్‌పై 2 సంవత్సరాలు, మ్యాను ఫ్యాక్ఛరింగ్ పై 1 సంవత్సరం వారంటీ అందిస్తున్నారు.
హావెల్స్ కూలర్
17 లీటర్ల స్టోరేజ్ ట్యాంక్‌తో వచ్చే ఈ ఎయిర్ కూలర్ 52 శాతం తగ్గింపుతో 4,199 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఇన్వర్టర్ అనుకూలతతో వచ్చే ఈ కూలర్‌లో తేనెగూడు ప్యాడ్‌లు, 3 స్పీడ్ సెట్టింగ్‌లు, 4-వే స్వింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
Also Read : అల్లు అర్జున్ బాటలోనే నాని నడుస్తున్నాడా..?