Affordable Sports Bike : యువతకు స్పోర్ట్స్ బైక్‌ల పట్ల క్రేజ్ రోజురోజుకు పెరుగుతుంది. అందుకే యువత ఇప్పుడు సాధారణ బైక్‌లకు బదులుగా అపాచీ, పల్సర్ వంటి బైక్‌లను కొనడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. మీరు కూడా మీ రోజువారీ వినియోగానికి అనువైన స్పోర్ట్స్ బైక్ కోసం చూస్తున్నట్లయితే ఈ కథనంలో కొన్ని అద్భుతమైన బైక్ వివరాలను తీసుకొచ్చాం. మీకు ఏది మంచిదో సెలక్ట్ చేసుకుని కొని.. డ్రైవింగ్ ఎంజాయ్ చేయండి. ఈ బైక్‌ల పవర్ ఫుల్ ఇంజిన్, స్పోర్టీ లుక్ చాలా మందిని ఆకర్షిస్తాయి. దీనితో పాటు ఈ బైక్‌లు రోజువారీ ఉపయోగం కోసం కూడా మంచిగా పని చేస్తాయి. మరి ఇన్ని ఫీచర్లు ఉండే ఈ స్పోర్ట్స్ బైక్‌ల ధర చాలా ఎక్కువగా ఉంటుందని చాలా మంది అనుకుంటున్నారు కదా. కానీ అలా కాదు. ఇక్కడ తక్కువ ధరలకు లభించే స్పోర్ట్స్ బైక్‌ల గురించి మాత్రమే చెప్పబోతున్నాను.
టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 160 4వి
మొట్టమొదటి స్పోర్ట్స్ బైక్ TVS Apache RTR 160 4V. ఈ TVS బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1 లక్ష 26 వేలు. ఇది 16సీసీ సింగిల్-సిలిండర్ ఇంజిన్‌తో పనిచేస్తుంది, ఇది 17.4 bhp పవర్, 14.73 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. TVS Apache RTR 160 4V ఇంజిన్ నుండి వెలువడే వేడిని దాదాపు 10 డిగ్రీల వరకు తగ్గించే సెగ్మెంట్-ఫస్ట్ ర్యామ్ ఎయిర్ కూలింగ్‌ను కలిగి ఉంది. ఆయిల్-కూలింగ్ తో ఈ బైక్ Fi లో 114 kmph గరిష్ట వేగాన్ని, Carb వేరియంట్లలో 113 kmph వేగాన్ని అందుకోగలదు.
బజాజ్ పల్సర్ NS160
రెండవ ఛాయిస్ బజాజ్ పల్సర్ NS160. దీని ప్రారంభ ధర రూ. 1 లక్ష 24 వేలు. ఈ బైక్ 160 సిసి ట్విన్ స్పార్క్ కలిగి ఉంది. బజాజ్ పల్సర్ NS160 నేరుగా TVS Apache RTR 160 4V, హీరో Xtreme 160R 4V, యమహా FZ-S Fi V3.0, సుజుకి జిక్సర్‌లతో పోటీపడుతుంది. ఈ బైక్‌లోని సింగిల్ సిలిండర్ ఇంజన్ 17 బిహెచ్‌పిల పవర్, 14.6 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
యమహా FZ-S FI V4
ఇవి కాకుండా మూడో ఛాయిస్.. యమహా FZ-S FI V4, దీని ఎక్స్-షోరూమ్ ధర ఢిల్లీలో రూ. 1 లక్ష 28 వేల 900. ఈ మోటార్ సైకిల్ లోని ఫీచర్లలో ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ (TCS), వెనుక డిస్క్ బ్రేక్ తో ముందు భాగంలో సింగిల్ ఛానల్ ABS, మల్టీ-ఫంక్షనల్ LCD ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, LED హెడ్ లైట్, టైర్ హగ్గింగ్ రియర్ మడ్ గార్డ్, లోయర్ ఇంజిన్ గార్డ్, బ్లూటూత్ ఎనేబుల్డ్ Y-కనెక్ట్ యాప్ ఉన్నాయి.
వీటిని నిశితంగా పరిశీలించి మీకు ఏ బైక్ నచ్చిందో కొనేసుకోండి.