Kia Syros vs Skoda Kylaq
Kia Syros vs Skoda Kylaq : భారత మార్కెట్‌లో స్కోడా కైలాక్ కారుకు మంచి ఆదరణ లభిస్తోంది. గత ఏడాది డిసెంబర్‌లో లాంచ్ అయిన ఈ కారుకు బాగా డిమాండ్ పెరిగింది. ఈ కారు డెలివరీ ఇప్పుడు అధికారికంగా ప్రారంభమైంది. స్కోడా కైలాక్ ప్రారంభ ధర రూ. 7.89 లక్షలు, ముంబైలో ఈ కారుకు ఆన్-రోడ్ ధర రూ. 8.87 లక్షల నుంచి రూ. 16.23 లక్షల వరకు ఉంది. మార్కెట్లో ఈ కారు ప్రధాన ప్రత్యర్థిగా కియా సైరోస్ ఉంది. ఇటీవలే భారత మార్కెట్లో కియా సైరోస్ ను విడుదల చేసింది కంపెనీ. కియా సైరోస్ ధర రూ. 9.7 లక్షల నుండి ప్రారంభమై టాప్ వేరియంట్ ధర రూ. 16.5 లక్షల వరకు ఉంటుంది.
స్కోడా కైలాక్
స్కోడా కైలాక్ 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 114 బిహెచ్‌పి పవర్, 178 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కోడా కారు ఇంజిన్‌తో పాటు 3-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆఫ్షన్ కూడా అందుబాటులో ఉంది. ఈ కారు అద్భుతమైన బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. అదనంగా, ఇది అద్భుతమైన రైడ్, హ్యాండ్లింగ్ బ్యాలెన్స్‌ను అందిస్తుంది. ముంబైలో స్కోడా కైలాక్ ఆన్-రోడ్ ధర రూ. 8.87 లక్షల నుండి ప్రారంభమై రూ. 16.23 లక్షల వరకు ఉంటుంది.
స్కోడా కైలాక్ – ఇంజిన్, ఫీచర్స్
* 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్
* 114 bhp పవర్, 178 Nm టార్క్
* 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలు
* అద్భుతమైన బిల్డ్ క్వాలిటీ, సస్టైనబుల్ రైడ్ & హాండ్లింగ్
* భారత NCAP నుంచి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్
* 6 ఎయిర్‌బ్యాగ్స్
కియా సైరోస్
కియా సైరోస్ ఒక కొత్త కాంపాక్ట్ SUV. ఈ కారులో వెనుక సీటు స్పేస్ కూడా కియా సోనెట్ కంటే ఎక్కువ. సోనెట్ లాగానే, కియా సైరోస్ కూడా 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ఆఫ్షన్ తో వస్తుంది. ఈ కియా కారులో అనేక పవర్ ఫుల్ ఫీచర్లు కూడా అందించింది కంపెనీ. ఈ కారులో లెవల్ 2 ADAS, వెంటిలేటెడ్ రియర్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. ఉంది. సేఫ్టీ రేటింగ్ పరంగా కైలాక్ భారత్ NCAP నుండి 5-స్టార్ భద్రతా రేటింగ్‌ను పొందింది, అయితే సైరోస్ ఎటువంటి సేఫ్టీ రేటింగ్‌ను పొందలేదు. రెండు కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు లభిస్తాయి.
కియా సైరోస్ – ప్రత్యేకతలు
* 1.0-లీటర్ టర్బో పెట్రోల్ & 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ ఎంపికలు
* Level 2 ADAS (ఆటోమేటిక్ డ్రైవింగ్ అసిస్టెంట్ సిస్టమ్)
* వెంటిలేటెడ్ రియర్ సీట్స్
* పెనోరామిక్ సన్‌రూఫ్
* 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్
* 6 ఎయిర్‌బ్యాగ్స్, కానీ NCAP సేఫ్టీ రేటింగ్ లేదు
ఎంచుకోవాల్సిన కారు?
సేఫ్టీ పరంగా చూస్తే స్కోడా కైలాక్ 5-స్టార్ NCAP రేటింగ్ పొందింది. అయితే, కియా సైరోస్‌లో అధునాతన ADAS ఫీచర్లు, లగ్జరీ ఇంటీరియర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక ధర విషయంలో కైలాక్ కాస్తా తక్కువ ఖరీదుగా ఉండగా, సైరోస్ ఎక్కువ ఫీచర్లు అందిస్తోంది.