Homeబిజినెస్Upcoming Cars In February 2025 : వచ్చే నెలలో లాంచ్ కానున్న పవర్ ఫుల్...

Upcoming Cars In February 2025 : వచ్చే నెలలో లాంచ్ కానున్న పవర్ ఫుల్ కార్లు.. వాటి ఫీచర్లు, ధర తెలిస్తే మైండ్ బ్లాక్ కావాల్సిందే ?

Upcoming Cars In February 2025 : 2025 సంవత్సరంలో రెండవ నెల ఫిబ్రవరి ప్రారంభం కానుంది. ఈ నెలలో కూడా జనవరి లాగే అనేక పవర్ ఫుల్ కార్లు భారత మార్కెట్లోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఫిబ్రవరి 2025లో రూ. 10 లక్షల నుండి రూ. 2.3 కోట్ల వరకు ధర ఉన్న కార్లు విడుదల కానున్నాయి. ఫిబ్రవరిలో విడుదల కానున్న కార్ల జాబితాలో కియా నుండి ఆడి వరకు మోడళ్లు ఉన్నాయి. ఫిబ్రవరిలో భారతదేశ ప్రజల కోసం ఏ వాహనాలను మార్కెట్లోకి విడుదల చేయనున్నాయో తెలుసుకుందాం. భారత మార్కెట్లో ఫిబ్రవరి 2025 ప్రారంభం నుండి చాలా కొత్త కార్లు లాంచ్ కానున్నాయి. జనవరి నెలలో ఉత్పత్తికి వచ్చిన కార్ల తరహాలో ఈ నెలలోనూ ఆల్-టైమ్ హిట్ కానున్న కార్లు ఉన్నాయి. ఫిబ్రవరి నెలలో రాబోతున్న కార్లలో కియా (Kia) నుండి ఆడి (Audi) వరకు అనేక కంపెనీలు ఉన్నాయి.

కియా సైరోస్ (Kia Syros)
కియా యొక్క కొత్త మోడల్ Kia Syros, ఫిబ్రవరి 1, 2025 న భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ కారును 10 లక్షల రూపాయల నుండి 20 లక్షల రూపాయల ధర మధ్య అందుబాటులో ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇది ఒక బడ్జెట్-ఫ్రెండ్లీ కాంపాక్ట్ ఎస్యూవీ. ఇందులో 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతో పాటు వేంటిలేటెడ్ రియర్ సీట్లు, 12.3-ఇంచ్ టచ్ స్క్రీన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ప్యానోరమిక్ సన్‌రూఫ్ వంటి అధునాతన ఫీచర్లు ఉండొచ్చు.

ఆడీ ఆర్ఎస్ క్యూ8(Audi RS Q8 2025)
ఆడి కూడా Audi RS Q8 2025 మోడల్‌ను 17 ఫిబ్రవరి 2025 న భారత మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఈ కారులో 3998 cc, 8-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుందని, ఇది ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ తో అందుబాటులో ఉంటుంది. ఈ ప్రీమియం ఎస్యూవీ ధర సుమారు 2.30 కోట్ల రూపాయలుగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

ఎంజీ మెజెస్టర్(MG Majestor)
ఎమ్జీ మోటార్స్ తన కొత్త ఫ్లాగ్‌షిప్ ఎస్యూవీ MG Majestor ని 18 ఫిబ్రవరి 2025 న లాంచ్ చేయనుంది. ఈ కారులో డీజిల్ ఇంజిన్ ఆప్షన్ ఉంటుందని, ఇది ప్రీమియం కార్ల విభాగంలో రాబోతుంది. దీని ధర సుమారు 46 లక్షల రూపాయల వరకు ఉండవచ్చని అంచనా. ఫిబ్రవరి నెలలో లాంచ్ కానున్న ఈ కార్లు భారత మార్కెట్లో అనేక ఆఫర్‌లు, అద్భుతమైన ఫీచర్లు, అదనపు ప్రత్యేకతలను అందించడంతో కారు ప్రియులు పెద్ద ఎత్తున ఎదురుచూస్తున్నారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version