https://oktelugu.com/

Adani Group : అదానీ చేతికి మరో మీడియా హౌస్

క్వింటిలియన్ బిజినెస్ మీడియాలో ( క్యూబీఎంఎల్) లో 51% వాటాను అదాని ఎంటర్ప్రైజెస్ కొనుగోలు చేయనుంది.

Written By:
  • Rocky
  • , Updated On : August 16, 2023 / 08:00 PM IST
    Follow us on

    Adani Group : గత ఏడాది ఎన్డిటీవీలో కొన్ని వాటాలు కొనుగోలు చేసి అందులోకి ప్రవేశించిన.. కార్పొరేట్ దిగ్గజం గౌతమ్ అదాని.. కొన్నాళ్ళకి మరిన్ని వాటాలు కొనుగోలు చేసి ఎన్డి టీవీని కైవసం చేసుకున్నాడు. కమ్యూనిస్టు పాట పాడే ఆ ఛానల్ ఇప్పుడు బిజెపి ఫోల్డ్ లోకి వెళ్లిపోయింది. ఇది మర్చిపోకముందే గౌతమ్ అదానీ చేతిలోకి మరో ప్రముఖ మీడియా సంస్థ వెళ్ళిపోయింది. దీనికి సంబంధించిన డీల్ కుదరడంతో అధికారికంగా ఈ ప్రకటన గౌతమ్ అదానీ వెల్లడించారు.

    మీడియా దిగ్గజం రాఘవ్ బెహల్ నెలకొల్పిన డిజిటల్ న్యూస్ ఫ్లాట్ ఫామ్ క్వింటిలియన్ బిజినెస్ గురించి తెలియని వారు ఉండరు. బిజినెస్ కు సంబంధించి కొత్త కొత్త వార్త కథనాలు అందించడంలో ఈ న్యూస్ ప్లాట్ ఫామ్ సరికొత్త రికార్డులను నెలకొల్పింది. ప్రారంభించిన అనతి కాలంలోనే నెంబర్ వన్ న్యూస్ ఫ్లాట్ ఫామ్ గా ఎదిగింది. ఆమధ్య గౌతమ్ అదానీ కంపెనీలకు సంబంధించి హిండెన్ బర్గ్ నివేదికలను ఈ న్యూస్ ఫ్లాట్ ఫామ్ ప్రముఖంగా ప్రచురించింది. అప్పట్లో ఈ సంస్థ ప్రచురించిన కథనాల ఆధారంగానే దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. అయితే ఇది తనకు పంటి కింద రాయిలాగా మారింది అనుకున్నాడో ఏమో తెలియదు కానీ.. ఈ సంస్థపై గౌతమ్ అదాని కన్ను వేశాడు.. గత కొంతకాలంగా దీనిని కొనుగోలు చేయాలని ప్రయత్నాలు ప్రారంభించాడు. అవి ఇటీవల ఓ కొలిక్కి వచ్చాయి. బుధవారం నాటితో ఆ చర్చలు కాస్త సఫలమై వాటాలు అదాని చేతిలోకి వెళ్లిపోయాయి.

    క్వింటిలియన్ బిజినెస్ మీడియాలో ( క్యూబీఎంఎల్) లో 51% వాటాను అదాని ఎంటర్ప్రైజెస్ కొనుగోలు చేయనుంది. నా అనుబంధ సంస్థ ఏఎంజీ మీడియా నెట్వర్క్ (ఏఎంఎన్ఎల్) దీనికి సంబంధించి అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు వివరాలను స్టాక్ ఎక్స్ చేంజ్ లకు తెలియజేసింది. లావాదేవీలు పూర్తి అయిన తర్వాత ఏఎంఎన్ఎల్ కు క్యూబీఎంఎల్ అనుబంధ సంస్థగా మారుతుందని ప్రకటించింది. బి క్యు ప్రైమ్ పేరిట మీడియా ఫ్లాట్ ఫామ్ ను నిర్వహించే క్యూబీఎంఎల్ లో ఏఎంఎన్ఎల్ గతంలో 48 కోట్లకు 49 శాతం వాటాలను కొనుగోలు చేసింది. గతంలో బ్లూమ్ బెర్గ్ క్వింట్ గా పిలిచే బి క్యూ ప్రైమ్ ను యూ ఎస్ వార్తా సంస్థ బ్లూమ్ బెర్గ్ మీడియా, భారత్ కు చెందిన క్వింటిలియన్ మీడియా సంస్థ సంయుక్తంగా ఏర్పాటు చేశాయి. అయితే, బ్లూమ్ బెర్గ్ ఏడాది మార్చిలో ఆ భాగస్వామ్యం నుంచి వై దొలిగింది. ఇదే అదునుగా అందులోకి అదానీ ఎంటర్ ప్రైజెస్ ప్రవేశించింది.