AC : ప్రస్తుతం రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీంతో వేడి కూడా ఎక్కువ అవుతోంది. ఉక్కపోతతో చాలా మంది ఇళ్లలో ఉండలేకపోతున్నారు. అందుకే చాలామంది ఇళ్లలో ఏసీలు వాడడం మొదలుపెట్టారు. ఏసీ వల్ల వేడి నుంచి ఉపశమనం లభించినప్పటికీ చాలా మందికి ఎక్కువ కరెంట్ బిల్లు వస్తుందని టెన్షన్ పడుతున్నారు. ఈరోజు ఎయిర్ కండీషనర్ రాత్రింబవళ్లు వాడినా సరే కరెంట్ బిల్లు రాదు. అలాంటి సోలార్ పవర్డ్ ఏసీ గురించి వివరంగా తెలుసుకుందాం.
సోలార్ ఏసీ నేరుగా సూర్యరశ్మితో నడుస్తుంది. ఏసీకి అమర్చిన ప్యానెల్‌లో పవర్ స్టోర్ చేయబడుతుంది. ఆ తర్వాత ఈ సోలార్ ఎనర్జీతో మీ ఏసీ పనిచేస్తుంది. సోలార్ ఎనర్జీతో పనిచేయడం వల్ల ఈ ఏసీలు విద్యుత్ వినియోగించవు. దీని వల్ల మీ నెలవారీ కరెంట్ బిల్లు చాలా వరకు తగ్గిపోతుంది. ఏయే కంపెనీలు సోలార్ ఏసీలను విక్రయిస్తున్నాయి. దాని ధర ఎంత ఉంటుంది.. ఫీచర్ల గురించి తెలుసుకుందాం.
Also Read : రూ.40,000 లోపు బెస్ట్ ఏసీలు ఇవే.. వాయిస్ కంట్రోల్ తో పాటు మరెన్నో ఫీచర్స్
సోలార్ ఏసీ 1.5 టన్ ధర
సోలార్ ఏసీలు ఖరీదైనవే అయినప్పటికీ.. ఇది ఒకసారి మాత్రమే పెట్టే పెట్టుబడి. ఎందుకంటే వీటిని అమర్చిన తర్వాత మీకు కరెంట్ బిల్లు టెన్షన్ ఉండదు. ఇవి విద్యుత్ ను వినియోగించవు. ఏసీతో పాటు సోలార్ ప్యానెల్, బ్యాటరీ కూడా వస్తాయి.
ఎక్సాల్టా అనే కంపెనీ సోలార్ ఏసీలను విక్రయిస్తోంది. ఈ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం.. కంపెనీ సోలార్ ఏసీ పగటిపూట సోలార్ ప్యానెల్‌తో పనిచేస్తుంది.. కానీ సూర్యుడు అస్తమించిన తర్వాత అంటే సాయంత్రం బ్యాటరీ సహాయంతో చల్లటి గాలిని అందిస్తుంది. 6 సోలార్ ప్యానెల్‌లు (ప్రతి ప్యానెల్ 350 వాట్స్), 300AH లిథియం బ్యాటరీతో వచ్చే 1.5 టన్నుల ఏసీని రూ. 2,70,032కు విక్రయిస్తున్నారు.
దీంతో పాటు మొసెటా అనే కంపెనీ కూడా సోలార్ ఏసీలను విక్రయిస్తోంది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో 1.5 టన్నుల సోలార్ ఏసీని రూ. 1,05,000కు విక్రయిస్తున్నారు. ఈ ఉత్పత్తి టెక్నాలజీ ఫీచర్లతో పాటు గమనించదగ్గ విషయం ఏంటంటే ఈ ఏసీ 350 వాట్ల 2 ప్యానెల్‌లతో లేదా 550 వాట్ల 1 ప్యానెల్‌తో వస్తుంది. కానీ సౌర శక్తితో పాటు ఈ ఏసీకి 0.5A విద్యుత్ కూడా అవసరం అవుతుంది. అంటే చాలా తక్కువ విద్యుత్ వినియోగంతో ఈ ఏసీ చల్లగా ఉంచుతుంది.
Also Read : ఏసీని కొనాలి అనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే