https://oktelugu.com/

Aadhar Pan Link: ప్రజలకు అలర్ట్.. ఈ నెలాఖరు లోపు ఖచ్చితంగా పూర్తి చేయాల్సిన పనులివే?

Aadhar Pan Link: సెప్టెంబర్ నెల రావడంతో పాటు కొత్త నిబంధనలు సైతం అమలులోకి రానున్నాయి. సెప్టెంబర్ నెలలో ఖచ్చితంగా కొన్ని పనులను పూర్తి చేయాలి. ఏ కారణం చేతనైనా ఆ పనులను పూర్తి చేయడం సాధ్యం కాకపోతే నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆధార్ పాన్ లింక్ గడువును కేంద్రం ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. పన్ను చెల్లింపుదారులు ఈ నెలాఖరులోగా ఆధార్ కార్డ్ పాన్ కార్డును లింక్ చేసుకోవాల్సి […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : September 2, 2021 9:37 am
    Follow us on

    Aadhar Pan LinkAadhar Pan Link: సెప్టెంబర్ నెల రావడంతో పాటు కొత్త నిబంధనలు సైతం అమలులోకి రానున్నాయి. సెప్టెంబర్ నెలలో ఖచ్చితంగా కొన్ని పనులను పూర్తి చేయాలి. ఏ కారణం చేతనైనా ఆ పనులను పూర్తి చేయడం సాధ్యం కాకపోతే నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆధార్ పాన్ లింక్ గడువును కేంద్రం ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. పన్ను చెల్లింపుదారులు ఈ నెలాఖరులోగా ఆధార్ కార్డ్ పాన్ కార్డును లింక్ చేసుకోవాల్సి ఉంటుంది.

    సెప్టెంబర్ 30వ తేదీలోపు పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేసుకోని వాళ్ల పాన్ కార్డు చెల్లుబాటు కాదు. భవిష్యత్తులో ఇబ్బందులు పడకుండా ఆధార్ కార్డుతో పాన్ కార్డును లింక్ చేసుకుంటే మంచిది. కేంద్ర ప్రభుత్వం ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ చేయడానికి చివరి తేదీని సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 30వ తేదీలోగా ఐటీఆర్ దాఖలు చేయకపోతే మాత్రం జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

    డీమ్యాట్ అకౌంట్ కేవైసీ అప్‌డేట్ కు కూడా సెప్టెంబర్ 30వ తేదీ చివరి తేదీగా ఉంది. మార్కెట్ రెగ్యులేటర్ సెబీ డీమ్యాట్ అకౌంట్ కేవైసీ అప్‌డేట్ గురించి వెల్లడించింది. కేవైసీ అప్ డేట్ చేసుకోకపోతే ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేయడం సాధ్యం కాదు. డీమ్యాట్ అకౌంట్ ఇన్‌యాక్టివ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సెప్టెంబర్ 30వ తేదీలోపు బ్యాంక్ అకౌంట్‌తో మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవడం కూడా ముఖ్యం.

    బ్యాంక్ ఖాతాలకు పాత మొబైల్ నంబర్ ఇచ్చిన వాళ్లు కొత్త మొబైల్ నంబర్ ను అప్ డేట్ చేసుకోవాలి. పాత నంబర్ ను వాడకపోతే కొత్త నెంబర్‌తో కచ్చితంగా బ్యాంక్ అకౌంట్‌ను అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్ 1 నుంచి ఆటో డెబిట్ ఫెసిలిటీకి సంబంధించి అడిషనల్ అథంటికేషన్ రూల్ అమలులోకి రానుందని తెలుస్తోంది.