Aadhaar Card Update: ఆధార్ ఉన్నవాళ్లకు అలర్ట్.. అవి ఒక్కసారి మాత్రమే మార్చుకునే ఛాన్స్!

Aadhaar Card Update: ప్రసుత కాలంలో ప్రభుత్వ సంబంధిత పథకాలు పొందాలన్నా, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవాలన్నా ఆధార్ కార్డ్ ఎంతో ముఖ్యమైన కార్డ్ అనే విషయం తెలిసిందే. ఆధార్ కార్డ్ లేకపోతే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటి ఆధార్ కార్డులో వివరాలు తప్పుగా నమోదై ఉంటే కచ్చితంగా ఆ వివరాలను మార్చుకోవాలి. పోస్టాఫీస్ తో పాటు ఇతర స్కీమ్స్ లో చేరాలన్నా ఆధార్ తప్పనిసరిగా ఉండాల్సిందే. అయితే ఆధార్ కార్డ్ లో పుట్టినతేదీ, జెండర్ […]

Written By: Kusuma Aggunna, Updated On : September 19, 2021 6:51 pm
Follow us on

Aadhaar Card Update: ప్రసుత కాలంలో ప్రభుత్వ సంబంధిత పథకాలు పొందాలన్నా, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవాలన్నా ఆధార్ కార్డ్ ఎంతో ముఖ్యమైన కార్డ్ అనే విషయం తెలిసిందే. ఆధార్ కార్డ్ లేకపోతే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటి ఆధార్ కార్డులో వివరాలు తప్పుగా నమోదై ఉంటే కచ్చితంగా ఆ వివరాలను మార్చుకోవాలి. పోస్టాఫీస్ తో పాటు ఇతర స్కీమ్స్ లో చేరాలన్నా ఆధార్ తప్పనిసరిగా ఉండాల్సిందే.

అయితే ఆధార్ కార్డ్ లో పుట్టినతేదీ, జెండర్ వివరాలను మార్చుకోవాలని అనుకునే వాళ్లు ఒక విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఒకే ఒకసారి మాత్రమే ఈ వివరాలను మార్చుకునే అవకాశం ఉంటుంది. ఆన్ లైన్ లో జెండర్ వివరాలను మార్చుకోవడానికి వీలు పడదు. సమీపంలో ఆధార్ కేంద్రాన్ని సంప్రదించి మాత్రమే ఆన్ లైన్ లో ఆధార్ వివరాలను మార్చుకునే అవకాశం అయితే ఉంటుంది.

కొన్నిసార్లు ఆధార్ కేంద్రాలలో కూడా జెండర్ ను మార్పు చేయడం సాధ్యం కాదు. దరఖాస్తుదారులకు అలాంటి సమస్య ఎదురైతే వెంటనే 1947 నంబర్ కు కాల్ చేయడం లేదా help@uidai.gov.in మెయిల్ చేయడం ద్వారా జెండర్ ను మార్చుకునే ఛాన్స్ ఉంటుంది. ఆధార్ కార్డ్ చిరునామాలో తండ్రి లేదా భర్త పేరుకు సంబంధించి ప్రస్తుతం కేరాఫ్ అనే ఆప్షన్ వచ్చింది. తండ్రి లేదా భర్త పేరు వివరాలలో మార్చుకోవాలంటే ఆధార్ కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది.

ఆధార్ లో పుట్టినరోజుకు సంబంధించిన వివరాలను సైతం ఒక్కసారి మాత్రమే మార్చుకునే అవకాశం ఉంటుంది. ఆధార్ లోని వివరాలను మార్చుకోవాలంటే ఆధార్ కార్డుకు మొబైల్ నంబర్ ను లింక్ చేసుకోవాలి. మొబైల్ కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయడం ద్వారా ఆధార్ కు సంబంధించిన కొన్ని వివరాలను ఆన్ లైన్ లో అప్ డేట్ చేయవచ్చు.