CLW Recruitment 2021: భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. clw.indianrailways.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. 2021 సంవత్సరం అక్టోబర్ 3 ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.
ఎటువంటి దరఖాస్తు ఫీజు చెల్లించకుండానే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ట్రేడ్ అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీలలో రిఫ్రిజిరేషన్స్ అండ్ ఏసీ మెకానిక్స్, పెయింటర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, మెషినిస్ట్, టర్నర్, ఫిట్టర్ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 492 ఉద్యోగ ఖాళీలలో ఫిట్టర్ 200 పోస్టులు, టర్నర్ 20 పోస్టులు, మెషినిస్ట్ 56 పోస్టులు, వెల్డర్ 88 ఉద్యోగ ఖాళీలు, ఎలక్ట్రీషియన్ 112 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.
రిఫ్రిజిరేషన్స్& ఏసీ మెకానిక్స్ ఉద్యోగ ఖాళీలు 4 ఉండగా పెయింటర్ (జి) ఉద్యోగ ఖాళీలు 12 ఉన్నాయి. పదో తరగతి పాస్ కావడంతో పాటు ఐటీఐ (ఎన్‌సీవీటీ) పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 8,000 రూపాయల నుంచి 24,000 రూపాయల వరకు వేతనం లభిస్తుంది.
పదో తరగతిలో మెరిట్ మార్కుల ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. రాతపరీక్ష లేకుండా ఉద్యోగ ఖాళీల భర్తీ జరుగుతున్న నేపథ్యంలో నిరుద్యోగులకు జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరే అవకాశాలు ఉంటాయి.