
Pregnancy After 37: మారుతున్న కాలంతో పాటే పురుషులు, మహిళలలో చాలామంది అలవాట్లు, అభిరుచులు కూడా మారుతున్నాయి. నగరాలు, పట్టణాలలో ఉండే మహిళలలో ఎక్కువమంది వేర్వేరు కారణాల వల్ల అప్పుడే పిల్లలు వద్దని అనుకుంటూ ఉద్దేశపూర్వకంగా ప్రెగ్నెన్సీని వాయిదా వేస్తున్నారు. అయితే ఇలా వాయిదా వేయడం వల్ల మహిళల్లో చాలామంది సంతానలేమి సమస్యలతో బాధ పడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
దేశంలో 35 సంవత్సరాల వయస్సు దాటినా పిల్లల్ని కనని తల్లుల సంఖ్య ఎక్కువగా ఉంది. మహిళలు 37 సంవత్సరాల కంటే ముందే గర్భం ధరించాలని వయస్సు 37 సంవత్సరాలు దాటితే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు తగ్గుతాయని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. 37 సంవత్సరాల తర్వాత గర్భం దాల్చిన మహిళలకు గర్భస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 40 సంవత్సరాల తర్వాత గర్భం దాల్చిన మహిళలకు అబార్షన్ అయ్యే అవకాశాలు ఉంటాయి.
వైద్య నిపుణులు 40 సంవత్సరాల వయస్సు దాటిన వాళ్లు ఐవీఎఫ్ విధానంలో గర్భం దాల్చితే మంచిదని చెబుతున్నారు. మహిళలకు మద్యం అలవాటు ఉంటే ఆ అలవాటుకు దూరంగా ఉంటే మంచిదని వైద్య నిపుణులు పేర్కొన్నారు. పురుషులు సైతం మద్యం అలవాటుకు దూరంగా ఉంటే మంచిదని మద్యం అలవాటు వల్ల పుట్టబోయే పిల్లలు శారీరకంగా, మానసికంగా బలహీనులు అయ్యే అవకాశం ఉందని వైద్య నిపుణులు వెల్లడించారు.
పేరెంట్స్ కు ఆల్కహాల్ అలవాటు ఉంటే పుట్టబోయే పిల్లలకు గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు దక్షిణ కొరియా, చైనా దేశాలు పిల్లల్ని కనాలని ఇప్పటికే కొన్ని ఆఫర్స్ ను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే.