Lamborghini: దేశ వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ వ్యాపార రంగం పుంజుకుంటోంది. దీంతో లక్షల మందికి ఉపాధి లభిస్తోంది. దీంతో చాలా మంది ఈ రంగంలో పెట్టుబడి కూడా పెడుతున్నారు. అనేక సంస్థలు ఈ రంగంలోకి వచ్చాయి. పెద్దపెద్ద నిర్మాణ సంస్థలు కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు చిన్న చిన్న గిఫ్ట్‌లు ఇస్తాయి. వెంచల్ డెవలప్‌మెంట్, మెయింటనెన్స్ ఫ్రీ అని ప్రకటిస్తాయి. కొన్ని సంస్థలు గోల్డ్ కాయిన్, సిల్వర్ కాయిన్, తోపాటు గ్రుహోపయోగ వస్తువులు కానుకలుగా కొనుగోలుదారులకు ఇవ్వడం చూశాం. పోటీ తట్టుకోవడంతోపాటు కస్టమర్లను సంతృప్తి పర్చాలన్న లక్ష్యంతో ఇలా చేస్తున్నాయి. ఇక కొంత మంది వ్యాపారులు కస్టమర్లకు ఉచితంగా వెంచర్ చూసూ అవకాశం కల్పిస్తున్నారు. ఇందు కోసం కార్లు పంపించి వెంచర్‌కు తీసుకు వస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉంది. అయితే ఏడాది కాలంగా దేశవ్యాప్తంగా రియల్ వ్యాపారం నేల చూపు చూస్తోంది. అమ్మకాలు, కొనుగోళ్లు బాగా తగ్గాయి. పెరిగిన ధరలతో కొనుగోలుకు చాలా మంది వెనకాడుతున్నారు. కొనుగోలు శక్తికి మించి ధరలు ఉండడంతో మధ్య తరగతి ప్రజలు ఇళ్లు, స్థలాల కొనుగోలుకు వెనకాడుతున్నారు. దీంతో రిజిస్ట్రేషన్లు గణనీయంగా తగ్గాయి. హైదరాబాద్‌లో అయితే పరిస్థితి దారుణంగా ఉంది. దేశంలోనే గడిచిన మూడు నెలల్లో భారీగా వ్యాపారం పడిపోయింది. ఈ క్రమంలో ఓ రియల్ ఎస్టేట్ సంస్థ కస్టమర్లకు భారీ ఆఫర్ ప్రకటించింది.
విల్లా ఖరీదు రూ.26 కోట్లు..
ఉత్తర ప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ జేపీ గ్రీన్స్ లగ్జరీ విల్లాలు నిర్మించింది. తాజా పరిస్థితులతో వాటిని కొనేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. దీంతో నిర్మించిన విల్లాలు అమ్మేందుకు నిర్మాణ సంస్థ ఓ ఆలోచన చేసింది. తమ విల్లాలు కొనుగోలు చేసిన వారికి లంబోర్గిని ఉరుస్ కారును ఉచితంగా ఇస్తామని ప్రకటించింది. ఈమేరకు జేపీ గ్రీన్స్ సంస్థ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాము విక్రయించే రూ.26 కోట్ల విలువైన అల్ట్రా ప్రీమియం విల్లాను కొనుగోలు చేసే కస్టమర్లకు మాత్రమే కారు ఉచితమని ట్వీట్‌లో ఉంది. ఇక విల్లా కొనుగోలు చేసేవారు.. ఇతర విలాసవంతమైన సదుపాయాలు(పార్కింగ్, స్విమ్మింగ్‌పూల్, థియేటర్, కల్బ్ మెంబర్‌షిప్, గోల్ఫ్ కోర్స్) కావాలంటే అదనంగా రూ.50 లక్షలు చెల్లించాలని పేర్కొంది.
కారు విలువ రూ.4.5 కోట్లు..
ఇక జేపీ గ్రీన్స్ సంస్థ ఇచ్చే కారు మామూలు కారు కాదు. ప్రపంచంలో ఖరీదైన ఖారు లంబోర్గిని ఉరుఫ్. దీని విలువ ప్రస్తుత మార్కెట్‌లో రూ.4.5 కోట్లు. ప్రపంచ వ్యాప్తంగా ఈ కారుకు మంచి క్రేజ్ ఉంది. దానిని సొంతం చేసుకోవాలని, ఒక్కసారైనా అందులో తిరగాలని చాలా మంది కలలు కంటారు. అంతటి కారును జేపీ గ్రీన్స్ సంస్థ ఉచితంగా ఇవ్వడానికి ముందుకు వచ్చింది. రూ.26 కోట్ల ఖరీదైన విల్లా కొనుగోలు చేసేవారి లైఫ్ కూడా అంతే లగ్జరీగా ఉంటుంది. అందుకే నిర్మాణ సంస్థ ఖరీదైన కారును ఫ్రీగా ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే ఈ ట్వీట్లో ఎంత నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది. ట్వీట్‌పై మాత్రం నెటిజన్లు భిన్నమైన కామెంట్లు పెడుతున్నారు.
Noida’s got a new Villa Project coming up at 26 Cr that’s offering 1 Lamborghini with each of those! pic.twitter.com/gZqOC8hNdZ
— Gaurav Gupta | Realtor (@YourRealAsset) October 27, 2024