HDFC: హెచ్ డీ ఎఫ్ సీ ఖాతాదారులకు భారీ షాక్.. ఆగస్టు 1 నుంచి వీటిపై అదనపు ఛార్జీలు..

దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకుల్లో HDFC నెంబర్ 2 గా కొనసాగుతోంది. ఈ బ్యాంకులో కొన్ని నివేదికల ప్రకారం 120 మిలియన్ల ఖాదాదారులు ఉన్నాయి. దేశం మొత్తంలో 8300 బ్రాంచులు, 1,77,00 మంది ఉద్యోగులు ఇందులో పనిచేస్తున్నారు.

Written By: Chiranjeevi Appeesa, Updated On : July 29, 2024 6:05 pm

HDFC

Follow us on

HDFC: ప్రముఖ ప్రైవేట్ బ్యాంకు HDFC వినియోగదారులకు భారీ షాక్ ఇచ్చింది. వచ్చే ఆగస్టు నుంచి కొన్ని లావాదేవీలపై అదనపు రుసుము వసూలు చేస్తున్నట్లు ప్రకటన చేయడంతో ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ బ్యాంకు కు కనెక్ట్ అయిన థర్డ్ పార్టీ నుంచి నగదు లావాదేవీలు జరపడం వల్ల ఇన్ని రోజులు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయలేదు. అంతేకాకుండా హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంకు క్రెడిట్ కార్డుపై కొన్ని లావాదేవీలపై అదనపు ఛార్జీలు వేయలేదు. కానీ ఇప్పుడు కొన్నింటిపై 1 శాతం ఛార్జీలు వసూలు చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో పేటీఎం, క్రెడ్, మొబీ క్విక్ వంటి థర్డ్ పార్టీల ద్వారా నగదు లావాదేవీలు నిర్వహిస్తే అదనంగా ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. ఈ ఛార్జీల పెంపుదలకు కారణాలు విధించలేదు. కానీ ఒక్కసారిగా ఈ నిర్ణయం తీసుకోవడంతో బ్యాంకు ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా మిగతా బ్యాంకులు కాకుండా ప్రైవేట్ బ్యాంకుల్లో నెంబర్ 2గా కొనసాగుతున్న హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు ఇలాంటి నిర్ణయం తీసుకోవడపై చాలా మంది వినియోగదారులకు షాక్ ఇచ్చినట్లు అయింది. ఇప్పటివ వరకు బ్యాంకుకు సంబధించిన పేజాప్ యాప్ తోనే కాకుండా వివిధ థర్డ్ పార్టీ యాప్ లను ఉపయోగించి మనీ ట్రాన్స్ ఫర్ చేశారు. తాజా నిర్ణయంతో ఈ లావాదేవీలు తగ్గనున్నాయి. అయితే బ్యాంకు ఏయే లావాదేవీలపై ఎటువంటి ఛార్జీలు వేస్తున్నాయి? ఎంత మొత్తంలో ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు? అనే వివరాల్లోకి వెళ్దాం..

దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకుల్లో HDFC నెంబర్ 2 గా కొనసాగుతోంది. ఈ బ్యాంకులో కొన్ని నివేదికల ప్రకారం 120 మిలియన్ల ఖాదాదారులు ఉన్నాయి. దేశం మొత్తంలో 8300 బ్రాంచులు, 1,77,00 మంది ఉద్యోగులు ఇందులో పనిచేస్తున్నారు. ఈ బ్యాంకు నుంచి నిత్యం లక్షల మంది కోట్ల రూపాయల లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ఈ బ్యాంకు కు కనెక్ట్ అయినత థర్డ్ పార్టీలు పేటీఎం, మొబీ క్విక్, క్రెడ్ నుంచి లావాదేవీలు ఎక్కువగా నిర్వహిస్తున్నారు. అయితే తాజాగా ఈ బ్యాంకు షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 1 నుంచి కొన్ని లావాదేవీలపై 1 శాతం రుసుము వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.

పై యాప్ ల నుంచి రూ.3 వేల నుంచి రూ. 50 వేల వరకు లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. అంతకంటే ఎక్కువ లావాదేవీలు నిర్వహిస్తే 1 శాతం ఛార్జీలు నిర్వహిస్తారు. అయితే ఆ లోపు ఎలాంటి ఛార్జీలు ఉండవు. అయితే బీమాకు సంబంధించిన లావాదేవీలు నిర్వహిస్తే ఎలాంటి ఛార్జీలు విధించరు. వీటితో పాటు ఈ బ్యాంకు కార్డులపై రూ.15 వేల కంటే ఎక్కువగా ఇంధన లావాదేవీలు నిర్వహిస్తే 1 శాతం ఛార్జీలు విధిస్తారు. తక్కువ లావాదేవీలకు ఎలాంటి రుసుము వసూలు చేయరు.

థర్డ్ పార్టీలైన క్రెడ్, పేటీఎం తో పాటు వివిధ యాప్ ల నుంచి లావాదేవీలు నిర్వహించడం ద్వారా 1 శాతం ఛార్జీలు పడుతాయి. అయితే ఇందులో రూ.3 వేల వరకు పరిమితి ఉంది. అంతకంటే ఎక్కువగా లావాదేవీలు నిర్వహిస్తే ఛార్జీలు వర్తిస్తాయి. ఇవి పాఠశాల వెబ్ సైట్, పీవోఎస్ మెషీన్ లకు వర్తించదు. ఇక ఇంటర్నేషనల్ కరెన్నీ ట్రాన్జాక్షన్ పై 3.5 వాతం మార్కప్ ఛార్జీలు విధిస్తారు. ఈ ఛార్జీలు ఆలస్యంగా చెల్లిస్తే అదనంగా రూ. 100 నుంచి రూ. 300 విధిస్తారు. వీటితో పాటు స్టేట్ మెంట్ క్రెడిట్ లేదా రివార్డ్ లపై రీడీమ్ చేసుకుంటే రూ.50 వసూలు చేస్తారు. రివాల్వింగ్ కస్టమర్లకు నెలకు 3.7 శాతం ఛార్జీలు వసూలు చేస్తారు.