https://oktelugu.com/

Balakrishna: నందమూరి అభిమానులకు ఒక గుడ్ న్యూస్ చెప్పనున్న బాలయ్య…అది ఏంటో మీరు అస్సలు ఎక్స్ పెక్ట్ చేయలేరు…

నందమూరి నట సింహం గా పేరుపొందిన బాలయ్య ప్రస్తుతం హ్యాట్రిక్ హిట్లను సాధించి మంచి జోష్ లో ఉన్నాడు. ఇక ఇప్పుడు చేయబోయే సినిమాలతో కూడా భారీ సక్సెస్ లను అందుకోవాలని చూస్తున్నాడు..

Written By:
  • Gopi
  • , Updated On : July 29, 2024 / 06:02 PM IST

    Balakrishna

    Follow us on

    Balakrishna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉందనే చెప్పాలి. ఇక నందమూరి తారక రామారావు గారి నుంచి ఇప్పుడున్న జూనియర్ ఎన్టీఆర్ వరకు ఈ ఫ్యామిలీ నుంచి వచ్చిన చాలామంది హీరోలు ప్రేక్షకులను అలరించడమే కాకుండా నందమూరి ఫ్యామిలీ పరువును నిలబెట్టుకుంటూ వస్తున్నారు. ఇక ఇలాంటి సందర్భంలోనే బాలకృష్ణ లాంటి మాస్ హీరో చేసిన ప్రతి సినిమా కూడా సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే తన నట వారసుడిగా మోక్షజ్ఞని ఇండస్ట్రీకి తీసుకురావాలనే ఉద్దేశ్యం లో ఆయన చాలా రోజుల నుంచి విపరీతమైన ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు. కానీ అది ఇప్పటివరకు వర్కౌట్ కాలేదు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు బాలయ్య బోయపాటి డైరెక్షన్ లో నాలుగో సినిమాని కూడా అనౌన్స్ చేశాడు. ప్రస్తుతం బాబీ డైరెక్షన్ లో సినిమాని చేస్తున్న బాలకృష్ణ ఈ సినిమా పూర్తి అయిన వెంటనే బోయపాటితో చేసే సినిమాను సెట్స్ మీదకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సందర్భంలోనే బాలకృష్ణ తన అభిమానులందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. అది ఏంటి అంటే ఇక మోక్షజ్ఞ ఎంట్రీ గురించి చాలా సంవత్సరాల నుంచి చాలా వార్తలైతే వస్తున్నాయి.ఆయన ఎప్పుడు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తాడు అనే దానిమీద ఇప్పటివరకు సరైన క్లారిటీ అయితే లేదు.ఇక ఈ విషయం పక్కన పెడితే బాలయ్య బాబు మాత్రం తన సినిమాలకు సంబంధించిన ఒక గుడ్ న్యూస్ ని ప్రేక్షకులతో పంచుకోబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది…

    అది ఏంటి అంటే ఇక బోయపాటి శ్రీను డైరెక్షన్ లో ఈయన ఇప్పుడు చేస్తున్న సినిమాలో డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడట. దానికి సంబంధించిన ఒక పోస్టర్ ని రిలీజ్ చేయడమే కాకుండా ఆ సినిమాలో ఒక పాత్రలో రైతుగా కూడా తను కనిపించబోతున్నాడట. ఇక ఇదే విషయాన్ని తన అభిమానులతో పాటు ప్రేక్షకలోకానికి కూడా తెలియజేయాలని తను కోరుకుంటున్నాడు. నిజానికి బాలయ్య బాబుకి రైతులు అంటే చాలా ఇష్టం…అందుకే వాళ్ళ తరపున పోరాటం చేయడానికి తను సినిమాని మాధ్యమంగా వాడుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ ని జనాలకి పరిచయం చేస్తూ ప్రతి ఒక్కరూ వాళ్ల పట్ల కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండాలని ఆయన ఎప్పుడు కోరుకుంటాడు. కాబట్టే ఆయన రైతు పాత్ర చేయడానికి చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాడు.

    ఇక ఎట్టకేలకు తన ఆస్థాన దర్శకుడు అయిన బోయపాటి శ్రీను డైరెక్షన్ లో ఆ క్యారెక్టర్ ని ప్లే చేయడం అనేది ఆయనకు చాలా సంతోషంగా ఉందట. ఇక ఇదే విషయాన్ని ఆగస్టు నెలలో అఫిషియల్ గా ప్రేక్షకులకు తెలియజేయాలని ఆయన ఉత్సాహాన్ని చూపిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక అదే విధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కొంత మంది ఉత్తమ రైతులకు సన్మానం కూడా చేయబోతున్నట్లుగా తెలుస్తుంది.

    ఇక ఇప్పటివరకు బాలయ్య చాలా పాత్రలు పోషించాడు. అయినప్పటికీ రైతు పాత్ర కోసం ఆయన చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నాడు. ఇక ఈ రోజుల్లో రైతు పరిస్థితి ఎలా ఉంది అనేది కూడా ఈ సినిమాలో తెలియజేయాలని చూస్తున్నాడట…మరి తను అనుకున్నట్టుగానే ఇప్పుడు చేస్తున్న ఈ పాత్ర లో రైతు కష్టాలు నష్టాల గురించి తెలియజేసి ప్రేక్షకుల మెప్పు పొందాలని చూస్తున్నాడట…