Put glasses in the lift: లిప్ట్ లో అద్దాలు ఎందుకు పెడుతారు? మొదటిసారి ఏ దేశాల్లో ఉపయోగించారు?

లిప్ట్ లో వెళ్లడం కొందరికి సరదా. కానీ మరికొందరికి మాత్రం ఏదో తెలియని భయం. ఎప్పడు ఏం జరగుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తుంటారు. అంతేకాకుండా కొన్ని భవానల్లో లిప్ట్ చాలా చిన్నవిగా ఉంటాయి. ఇలా ఇరుకుగా ఉండడం వల్ల అందుల్లో శ్వాస ఆడడానికి కూడా ఇబ్బంది

Written By: Srinivas, Updated On : October 22, 2024 3:16 pm

Put-glasses-in-the-lift

Follow us on

Put glasses in the lift: ప్రస్తుత కాలంలో ఎక్కడ చూసినా పెద్ద పెద్ద భవనాలు కనిపిస్తున్నాయి. మనుషులతో పాటు వారి ఆదాయం కూడా పెరగడంతో ప్రతి ఒక్కరూ ఓ ప్లాట్ ఉండాలని కోరుకుంటున్నారు. అయితే ఇండిపెండెట్ ఇల్లు అయితే శ్రమతో పాటు అధిక ఖర్చు ఉంటుందని కొందరు భావిస్తారు. దీంతో కొందరు నేరుగా అపార్ట్ మెంట్ లోని ప్లాట్లను కొనుగోలు చేస్తున్నారు. అపార్ట్ మెంట్ లో ఇల్లు కొనేముందు అన్ని సౌకర్యాలు ఉన్నాయా? లేవా? అనేది ముందుగా చూసుకోవాలి. వీటిలో లిప్ట్ ప్రధానమైనది. పైకి ఎక్కడానికి దిగడానికి లిప్ట్ ఎంతో సహకరిస్తుంది. లిప్ట్ తో టైం తో పాటు శ్రమ శక్తి తగ్గుతుంది. ఈ లిప్ట్ లో మనుషులే కాకుండా కొన్ని వస్తువులను కూడా పైకి తీసుకెళ్లొచ్చు. అయితే ఈ లిప్ట్ లో వెళ్లేటప్పుడు అద్దం కనిపిస్తుంది. ఇందులో అద్దాన్ని ఎందుకు అమర్చారు? దానికి గల కారణమేంటి?

ఒక బిల్డింగ్ లో లిప్ట్ సౌకర్యం ప్రధానమైనది. ఒకప్పుడు పెద్ద పెద్ద భవనాల్లో మాత్రమే లిప్ట్ లను ఏర్పాటు చేసేవారు. కానీ ఇప్పుడు 3వ అంతస్తు బిల్డింగ్ లోనూ లిప్ట్ ఉంటోంది. చాలా మంద చాలా సార్లు లిప్ట్ లో వెళ్లే ఉంటారు. కానీ కొన్ని లిప్టుల్లో అద్దాలు ఉంటాయి. కొందరు అందులో తమ ఫేస్ ను చూసుకొని అందంగా ఉన్నానా? లేదా? అని అనుకుంటారు. మరికొందరు మాత్రం ఇవి ఎందుకు ఏర్పాటు చేశారు? అని చర్చించుకుంటారు. అయితే లిప్ట్ లో అద్దాలు ఏర్పాటు చేయడానికి పెద్ద కారణమే ఉందట. అదేంటంటే?

లిప్ట్ లో వెళ్లడం కొందరికి సరదా. కానీ మరికొందరికి మాత్రం ఏదో తెలియని భయం. ఎప్పడు ఏం జరగుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తుంటారు. అంతేకాకుండా కొన్ని భవానల్లో లిప్ట్ చాలా చిన్నవిగా ఉంటాయి. ఇలా ఇరుకుగా ఉండడం వల్ల అందుల్లో శ్వాస ఆడడానికి కూడా ఇబ్బంది పడుతారు. ఇలాంటి సమస్యలను పరిష్కరించేందకు అద్దాలను ఏర్పాటు చేశారు. లిప్ట్ లో ఉన్న అద్దాలకు ఈ సమస్య పరిస్కారానికి సంబంధం ఏంటి అని అనుకుంటున్నారా?

లిప్ట్ లో వెళ్లే సమయంలో అద్దం ఉండడం వల్ల మనల్ని మనం చూసుకోగలుగుతాయం. అప్పుడు లిప్ట్ లో వెళ్తున్నామనే భయం ఉండదు. అలాగే చిన్న సైజు లిప్ట్ లో ప్రయాణించడ వల్ల ఆందోళన చెందడం వల్ల మరింత శ్వాస సమస్యలు ఉంటాయి. ఈ నేపథ్యంలో ప్రశాంతంగా ఉండడం వల్ల హార్ట్ బీట్ కొట్టుకోకుండా ఉంటుంది. అలాగే లిప్ట్ లో అద్దాలు ఉండడం వల్ల ఎవరు ఏం చేస్తున్నారోనని తెలిసిపోతుంది. దీంతో ఇతరులతో ఏర్పడే అసౌకర్యాలను వెంటనే గుర్తించవచ్చు.

జపాన్ లో మొదటిసారి అద్దాలు ఉన్న లిప్ట్ ను ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ అద్దాలను వికలాంగుల కోసం ఏర్పాటు చేశారు. లిప్ట్ లో వికలాంగులు తమ వీల్ చైర్ తో వెళ్లినప్పడు లిప్ట్ లో తిరగదు. దీంతో వారు స్టేట్ గా వెళ్లి అలాగే ఉండి.. తిరిగి వెనక్కి రావాల్సి ఉంటుంది. దీంతో వారు అద్దాల్లో చూస్తూ తమ వీల్ చైర్ ను అలాగే రివర్స్ గా తీస్తారు. అయితే ఆ తరువాత దాదాపు ఎక్కువ శాతం అపార్ట్ మెంట్లలో అద్దాలు ఉన్న లిప్టులను ఏర్పాటు చేస్తున్నారు.