https://oktelugu.com/

ఉద్యోగులకు మోదీ సర్కార్ శుభవార్త.. ఆ గడువు పొడిగింపు..?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరే విధంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. లీవ్ ట్రావెల్ కన్సీషన్ వోచర్ స్కీమ్ కింద బిల్లుల చెల్లింపునకు గడువును పొడిగిస్తున్నట్టు కీలక ప్రకటన చేసింది. కేంద్రం ఈ నెల 31వ తేదీ వరకు ఈ గడువును పొడిగించడం గమనార్హం. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో ఉద్యోగులు వారి ట్రావెల్ బిల్లులను ఇప్పుడు కూడా చెల్లించే అవకాశం ఉంటుంది. నిజానికి ఈ గడువు ఏప్రిల్ నెల 30వ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : May 12, 2021 / 11:17 AM IST
    Follow us on

    కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరే విధంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. లీవ్ ట్రావెల్ కన్సీషన్ వోచర్ స్కీమ్ కింద బిల్లుల చెల్లింపునకు గడువును పొడిగిస్తున్నట్టు కీలక ప్రకటన చేసింది. కేంద్రం ఈ నెల 31వ తేదీ వరకు ఈ గడువును పొడిగించడం గమనార్హం. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో ఉద్యోగులు వారి ట్రావెల్ బిల్లులను ఇప్పుడు కూడా చెల్లించే అవకాశం ఉంటుంది.

    నిజానికి ఈ గడువు ఏప్రిల్ నెల 30వ తేదీతోనే ముగియాల్సి ఉండగా కేంద్రం ఉద్యోగులకు ప్రయోజనం చేకూరేలా గడువును పొడిగించడం గమనార్హం. ఉద్యోగులు మే నెల 31వ తేదీలోపు బిల్లులను ప్రభుత్వానికి సమర్పిస్తే ఉద్యోగులు ఎల్టీసీ వోచర్ల స్కీమ్ యొక్క ప్రయోజనాలను సులభంగా పొందడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు. ఎల్‌టీసీ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పన్ను తగ్గింపుతో పాటు అదనపు ప్రయోజనాలను పొందవచ్చు.

    కరోనా వైరస్ విజృంభణ, పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ నిబంధనలు అమలవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గడువును పొడిగించడం గమనార్హం. కొంతమంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటికే బిల్లులను సమర్పించగా చాలామంది ఉద్యోగులు బిల్లులను సమర్పించాల్సి ఉంది. ప్రతి 4 సంవత్సరాలలో ఒకసారి మాత్రమే ఉద్యోగులు ఎల్‌టీసీ క్యాష్ వోచర్ స్కీమ్ ను పొందే అవకాశం ఉంటుంది.

    ఒకసారి ఈ స్కీమ్ కింద ప్రయోజనం పొందితే మళ్లీ నాలుగు సంవత్సరాల వరకు ఈ స్కీమ్ కింద ప్రయోజనం పొందడం సాధ్యం కాదు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ స్కీమ్ ద్వారా దేశంలో ఎక్కడైనా ప్రయాణం చేసే అవకాశాలు అయితే ఉంటాయి.