
కోవిడ్ వ్యాక్సినేషన్ విషయంలో వెనుకబడిన రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ బుధవారం సమావేశమవుతున్నారు. పరిస్థితిని ఆయన అడిగి తెలుసుకోనున్నారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతండటం, మహారాష్ట్ర, ఢీల్లి సహా పలు రాష్ట్రాలు వ్యాక్సిన్ కొరతను ఎదుర్కొంటున్న నేపథ్యంలో హర్షవర్ధన్ ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. 18 ఏళ్ల పైబడిన వారందరూ వ్యాక్సినేషన్ వేసుకోవాలని కేంద్రం ప్రకటించడంతో మే 1 నుంచి మూడో దశ వ్యాక్సిజేషన్ నడుస్తోంది.