
అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నర్సులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రోగులకు వైద్య చికిత్స అందించే సమయంలో ఎంతో సహనంతో తల్లిలాగా ప్రేమతో సాంత్వన చేకూర్చే సిస్టర్ల త్యాగం మానవీయమైనదని సీఎం కొనియాడారు. కరో్నాతో ప్రపంచం అల్లకల్లోలమైపోతున్న నేటి విపత్కర పరిస్థితుల్లో తమ ప్రాణాలను ఫణంగా పెట్టి కరోనా రోగుల ప్రాణాలను కాపాడేందుకు వైద్య సేవలందిస్తున్న నర్సుల రుణం తీర్చుకోలేనిదని సీఎం కేసీఆర్ అన్నారు.