50 లీటర్ల పెట్రోల్ ఫ్రీగా పొందే ఛాన్స్.. ఎలా అంటే..?

దేశంలో ప్రజల మధ్య ప్రస్తుతం ఎక్కువగా పెట్రోల్ గురించే చర్చ జరుగుతోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో పెట్రోల్ ధర 100 రూపాయల కంటే ఎక్కువగా ఉండటంతో వాహనదారులు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. పెట్రోల్ 100 మార్కును, డీజిల్ 90 మార్కును అందుకోవడంతో వాహనదారులపై ఊహించని స్థాయిలో ప్రతికూల ప్రభావం పడుతోంది. అయితే ఇండియన్ ఆయిల్ వాహనదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. వాహనదారులు ఉచితంగా పెట్రోల్ కొనుగోలు చేసే అవకాశాన్ని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అందిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ […]

Written By: Navya, Updated On : February 21, 2021 12:18 pm
Follow us on

దేశంలో ప్రజల మధ్య ప్రస్తుతం ఎక్కువగా పెట్రోల్ గురించే చర్చ జరుగుతోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో పెట్రోల్ ధర 100 రూపాయల కంటే ఎక్కువగా ఉండటంతో వాహనదారులు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. పెట్రోల్ 100 మార్కును, డీజిల్ 90 మార్కును అందుకోవడంతో వాహనదారులపై ఊహించని స్థాయిలో ప్రతికూల ప్రభావం పడుతోంది. అయితే ఇండియన్ ఆయిల్ వాహనదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది.

వాహనదారులు ఉచితంగా పెట్రోల్ కొనుగోలు చేసే అవకాశాన్ని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అందిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డును కలిగి ఉన్నవాళ్లు మాత్రమే ఈ ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది. ఎవరైతే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డును కలిగి ఉంటారో వారికి ఈ కార్డు ద్వారా రివార్డు పాయింట్లు లభిస్తాయి. ఫ్యూయెల్ పాయింట్స్ గా పిలవబడే ఈ రివార్డ్ పాయింట్లను రిడీమ్ చేసుకోవడం ద్వారా ఉచితంగా 50 లీటర్ల వరకు పెట్రోల్ ను పొందవచ్చు.

నెలకు 10,000 రూపాయల కంటే ఎక్కువ మొత్తం ఆదాయం ఉన్నవాళ్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వెబ్‌సైట్‌ ద్వారా క్రెడిట్ కార్డ్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 500 రూపాయలు జాయినింగ్ ఫీజు చెల్లించి ఈ క్రెడిట్ కార్డ్ ను పొందవచ్చు. సంవత్సరానికి వార్షిక ఫీజు 500 రూపాయలుగా ఉండగా కనీసం 50,000 రూపాయలను ఏడాదిలో క్రెడిట్ కార్డును వినియోగించి ఖర్చు చేస్తే వార్షిక ఫీజును చెలించాల్సిన అవసరం ఉండదు.

ఇండియన్ ఆయిల్ ఔట్‌లెట్స్‌లో పెట్రోల్, డీజిల్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డును వినియోగించి కొనుగోలు చేస్తే నెలకు గరిష్టంగా 250 ఫ్యూయెల్ పాయింట్లను పొందే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత నెలకు 150 ఫ్యూయెల్ పాయింట్లు లభిస్తాయి. ప్యూయెల్ పాయింట్లు 2 సంవత్సరాల వరకు వ్యాలిడిటీ కలిగి ఉంటాయి.