Gautam Gambhir : ఆ జట్టుపై ప్రేమ.. ఇంకో జట్టుపై ద్వేషం.. గౌతమ్ గంభీర్ ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు?

హార్థిక్ పాండ్యాను కాదని సూర్యకుమార్ యాదవ్ కు కెప్టెన్సీ ఇవ్వడం పట్ల టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈక్రమంలో జట్టు కూర్పు విషయంలోనూ గౌతమ్ గంభీర్ ఇష్టారాజ్యంగా వ్యవహరించాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జట్టులో రుత్ రాజ్ గైక్వాడ్ కు జట్టులో స్థానం ఇవ్వకపోవడం పట్ల నెటిజన్లు మండిపడుతున్నారు. ఇదే సమయంలో వన్డే జట్టులో కోల్ కతా జట్టు పేస్ బౌలర్ హర్షిత్ రాణా చోటు దక్కించుకోవడం పట్ల విస్మయం వ్యక్తమౌతోంది.

Written By: Anabothula Bhaskar, Updated On : July 19, 2024 12:35 pm
Follow us on

Gautam Gambhir : శ్రీలంకలో వన్డే, టి20 సిరీస్ ఆడే భారత జట్టును గురువారం సాయంత్రం బిసిసిఐ ప్రకటించింది. వన్డే కు రోహిత్ శర్మ, టి20 కి సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహించనున్నారు. ఈ రెండు ఫార్మాట్లకు వైస్ కెప్టెన్ గా గిల్ కొనసాగనున్నాడు. వాస్తవానికి గిల్ ప్రదర్శన ఇటీవల కాలంలో గొప్పగా ఏమీ లేదు. సూర్యకుమార్ యాదవ్ కూడా స్థిరంగా రాణించలేకపోతున్నాడు. అయినప్పటికీ బిసిసిఐ సూర్యకుమార్ యాదవ్ కు కెప్టెన్సీ ఇవ్వడం పట్ల రకరకాల విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల టీ20 వరల్డ్ కప్ లో హార్దిక్ పాండ్యా అద్భుతంగా రాణించాడు.. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్లో సత్తా చూపించాడు. వికెట్లు, పరుగులు తీసి తన ఆల్రౌండర్ ప్రతిభను ప్రదర్శించాడు. యాదృచ్ఛికంగా హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వకుండా, సూర్య కుమార్ యాదవ్ కు నాయకత్వ బాధ్యతలు అప్పగించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సూర్య సారధ్యంలో జూలై 7 నుంచి టీమిండియా శ్రీలంకతో మూడు టి20 మ్యాచ్ లు ఆడుతుంది. ఆగస్టు నుంచి రోహిత్ నాయకత్వంలో శ్రీలంకతో 3 వన్డేలు ఆడుతుంది.

మిగతావారి ఎంపికపై కూడా..

హార్థిక్ పాండ్యాను కాదని సూర్యకుమార్ యాదవ్ కు కెప్టెన్సీ ఇవ్వడం పట్ల టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈక్రమంలో జట్టు కూర్పు విషయంలోనూ గౌతమ్ గంభీర్ ఇష్టారాజ్యంగా వ్యవహరించాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జట్టులో రుత్ రాజ్ గైక్వాడ్ కు జట్టులో స్థానం ఇవ్వకపోవడం పట్ల నెటిజన్లు మండిపడుతున్నారు. ఇదే సమయంలో వన్డే జట్టులో కోల్ కతా జట్టు పేస్ బౌలర్ హర్షిత్ రాణా చోటు దక్కించుకోవడం పట్ల విస్మయం వ్యక్తమౌతోంది. టీమిండియా కోచ్ గా రాకముందు గౌతమ్ గంభీర్ ఐపీఎల్ లో కోల్ కతా జట్టుకు కెప్టెన్ గా, మెంటార్ గా వ్యవహరించాడు. ఆ జట్టులోని ఆటగాళ్లకు శ్రీలంక పర్యటనలో చోటు దక్కేందుకు గౌతమ్ గంభీర్ కారణమయ్యాడని నెట్టింట జోరుగా చర్చ సాగుతోంది..

ఎందుకు ఎంపిక చేయలేదు

ఇటీవల టి20 ఫార్మాట్ కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వీడ్కోలు పలికారు. రోహిత్ స్థానంలో ఓపెనర్ పాత్రను పోషించేందుకు చాలామంది ఆటగాళ్లు లైన్లో ఉన్నారు..గిల్, యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ వంటి వారు ఇప్పటికే సత్తా చాటారు. ఓపెనర్ అయిన తర్వాత ఆ స్థాయిలో ప్రాధాన్యమైన వన్ డౌన్ బ్యాటర్ స్థానాన్ని భర్తీ చేయడం అంత సులభం కాదు. ముఖ్యంగా వన్ డౌన్లో విరాట్ కోహ్లీ వచ్చాడు. అతడు జట్టు అవసరానికి తగ్గట్టుగా తన బ్యాటింగ్ స్టైల్ మార్చాడు. ఒకరకంగా చెప్పాలంటే టీమ్ ఇండియాకు ప్రధాన ఇరుసులాగా మారాడు.. అయితే రుతు రాజ్ గైక్వాడ్ ఇటీవల జింబాబ్వే టోర్నీలో కోహ్లీకి వారసుడిగా సత్తా చాటాడు. ఆడిన 2 ఇన్నింగ్స్ లలో 77*, 49 పరుగులతో సత్తా చాటాడు. 7 t20 ఇన్నింగ్స్ లలో ఏకంగా 71 సగటుతో, 158 స్ట్రైక్ రేట్ ను కొనసాగిస్తున్నాడు. కానీ శ్రీలంక పర్యటనకు వచ్చేసరికి అతనికి అవకాశం లభించలేదు. చివరికి బ్యాకప్ ఓపెనర్ గా కూడా అతడిని ఎంపిక చేయలేదు. ఇదే సమయంలో కోల్ కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కు వన్డే జట్టులో అవకాశం లభించింది. అంతేకాదు అతనికి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు లభిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇన్ని నిర్ణయాలకు ప్రధాన కారణం గౌతం గంభీర్ స్పోర్ట్స్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. చెన్నై ఆటగాడు గైక్వాడ్ పై గంభీర్ నిర్లక్ష్యం చూపిస్తున్నాడని..కోల్ కతా ఆటగాళ్లు అయ్యర్, హర్షిత్ రాణా పై ప్రేమ కురిపిస్తున్నాడని నెట్టింట చర్చ జరుగుతోంది. మరోవైపు చెన్నై ఆల్రౌండర్ శివం దుబే వన్డే, టి20 టోర్నీలలో స్థానం సంపాదించాడని.. గంభీర్ కు చెన్నై జట్టుపై ద్వేషముంటే అతడికి ఎందుకు అవకాశం ఇస్తాడని మరికొందరు కౌంటర్ ఇస్తున్నారు. కాగా రుతురాజ్ గైక్వాడ్ కు అవకాశం ఇవ్వకపోవడం పట్ల సీనియర్ ఆటగాళ్లు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు..

టీమిండియా టి20 జట్టు ఇదే

సూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, గిల్(వైస్ కెప్టెన్), రవి బిష్ణోయ్, రియాన్ పరాగ్, రింకు సింగ్, సంజు సాంసన్, హార్దిక్ పాండ్యా, శివం దుబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, మహమ్మద్ సిరాజ్, ఖలీల్ అహ్మద్, అర్ష్ దీప్ సింగ్.

టీమిండియా వన్డే జట్టు

రోహిత్ శర్మ (కెప్టెన్), గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, కులదీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్ దీప్ సింగ్, హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, రియాన్ పరాగ్.