
కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ రైతుల కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం అమలు చేస్తున్న పథకాలలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఒకటి. అర్హత ఉన్న రైతులకు ఆర్థిక తోడ్పాటును అందించే లక్ష్యంతో కేంద్రం ఈ స్కీమ్ ను అమలు చేస్తుండటం గమనార్హం. ఈ స్కీమ్ ను అమలు చేయడం ద్వారా రైతుల ఖాతాలో నేరుగా నగదు జమ కాదు.
సంవత్సరానికి 6,000 రూపాయలు ఈ స్కీమ్ ద్వారా పొందే అవకాశం ఉండగా ఒక్కో విడతలో 2,000 రూపాయలు చొప్పున బ్యాంక్ ఖాతాలలో నగదు జమ కానుంది. ఆగష్ట్ నెలలోనే డబ్బులు రైతుల ఖాతాలో నగదు జమవుతుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఏ తేదీన రైతుల ఖాతాలలో నగదు జమవుతుందో తెలియాల్సి ఉంది. పీఎం కిసాన్ స్కీమ్ అమలు ద్వారా రైతులకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు.
రోజురోజుకు ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో ఆన్ లైన్ ద్వారా ఈ స్కీమ్ కొరకు దరఖాస్తు చేసుకుంటే మంచిది. కొన్ని రోజుల క్రితం వరకు కొత్తగా రిజిష్టర్ చేసుకునే ఆప్షన్ పని చేయకపోయినా ఇప్పుడు ఆ ఆప్షన్ పని చేస్తుండటం వల్ల ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది. బ్యాంక్ అకౌంట్, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, పొలం పట్టా ద్వారా ఈ స్కీమ్ లో చేరే అవకాశం అయితే ఉంటుంది.
సమీపంలోని వ్యవసాయ కేంద్రాన్ని సంప్రదించడం ద్వారా ఈ స్కీమ్ లో సులువుగా చేరే అవకాశాలు అయితే ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో సంబంధం లేకుండా కేంద్రం ఈ స్కీమ్ ను అమలు చేస్తుండటం గమనార్హం.