https://oktelugu.com/

1964 Ambassador car : 1964 నాటి అంబాసిడర్ కారు .. దీని ధర తెలిస్తే అవాక్కవ్వాల్సిందే

జనరేషన్స్ మారినా.. వింటేజ్ అంబాసిడర్ రాయల్టీ కార్ ఎప్పుడు కూడా లెవలే వేరు అని చెప్పాలి. బ్రిటీష్ మూలాలు ఉన్నా సరే భారతీయ మార్కెట్లో తిరుగులేని ఖ్యాతిని పొందింది ఈ అంబాసిడర్ కారు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : November 23, 2024 4:56 pm
    1964 Ambassador car

    1964 Ambassador car

    Follow us on

    1964 Ambassador car : జనరేషన్స్ మారినా.. వింటేజ్ అంబాసిడర్ రాయల్టీ కార్ ఎప్పుడు కూడా లెవలే వేరు అని చెప్పాలి. బ్రిటీష్ మూలాలు ఉన్నా సరే భారతీయ మార్కెట్లో తిరుగులేని ఖ్యాతిని పొందింది ఈ అంబాసిడర్ కారు. ఈ కార్లు ఇప్పుడు అమ్మకంలో గానీ అందుబాటులో లేవు. కానీ కొన్ని కార్లు మాత్రం రీ మోడలింగ్ చేస్తున్నారు. అవి మాత్రం రోడ్లపై కనిపిస్తూనే ఉంటాయి. అంబాసిడర్ కారు రోడ్డుపైకి వచ్చిందంటే చాలు రాయల్ గా అనిపిస్తుంది కదా. అంబాసిడర్ కారును ‘కింగ్ ఆఫ్ ఇండియన్ రోడ్స్’ అని తెగ కొనియాడేవారు. భారత ఆర్మీ అధికారుల నుంచి ఎంపీలు, కేంద్ర మంత్రులు, సినిమా స్టార్స్, ఎమ్మెల్యేలు ఇలా వివిధ స్థాయిల్లో ఉన్నవారు ఈ అంబాసిడర్ కారునే ఉపయోగించేవారు. 90వ దశాబ్ధంలో ఈ కారు ఉంటే.. వారిని శ్రీమంతులు గా చూసేవారు. అంబాసీడర్‌‌ కారును స్టేటస్‌కి ఓ సింబల్‌ అని గర్వంగా ఫీల్ అయ్యేవారు. ప్రస్తుతం జనరేషన్‌కి తగ్గుట్టు ఈ కారు అప్ డేట్ కాలేదు కాబట్టి వీటి అమ్మాకాలు తగ్గిపోయాయి.

    గతంలో ఈ అంబాసిడర్‌ కార్ల హవా ఎలా ఉండేదో చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో అంబాసిడర్‌ కార్ ఉందంటే అది వారి హైలెవెల్ స్టేటస్ సింబల్ గా అనుకునేవారు. 1957 నుంచి 2014 వరకు అంబాసిడర్‌ అంబాసిడర్ల హవా ఫుల్ గా నడించింది బాస్. ఇప్పటికీ ఎక్కడో చోట ఈ కార్లు కనిపిన్నాయి కానీ క్రమంగా ఈ కార్లు కనిపించడం లేదు. హిందుస్థాన్‌ మోటార్స్‌ కంపెనీ తయారు చేసిన ఈ కార్ల అమ్మకాలు మొత్తం తగ్గిపోయాయి. దీంతో ఈ కార్లు ప్రస్తుతం మార్కెట్లోకి రావడం లేదు. ఆటో మొబైల్‌ రంగంలో అలజడి సృష్టించాయి ఈ కార్ల ఉత్పత్తి చేయడం ఆపేసింది హిందుస్థాన్‌ మోటార్స్‌ కంపెనీ. దీంతో అంబాసిడర్‌ లవర్స్ ఫుల్ డల్ అయ్యారు.

    త్రో బ్యాక్ ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో ఇలా పాత అంశాలు, పాత వస్తువులు, అలనాటి విశేషాలకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటాయి. ఇప్పుడు ఇదే తరహాలో 1964 నాటి అంబాసిడర్ కారు ఇన్ వాయిస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది. అప్పట్లో అంబాసిడర్ కారు ధర తెలుసుకొని నెటిజన్లు ఆశ్చర్యానికి గురి అవుతున్నారు. అయితే 1964లో అంబాసిడర్ కారు బిల్లును మద్రాస్ ట్రెండ్స్ అనే ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం కాస్త వైరల్ అవుతుంది. దీన్ని అక్టోబర్ 20, 1964న కొనుగోలు చేశారు. ఈ విషయం అందులో చూస్తే క్లారిటీగా అర్థం అవుతుంది. 1964లో అంబాసిడర్ ధర కేవలం రూ. 16,495 కావడం గమనార్హం.

    వైరల్ బిల్లు ప్రకారం, కారు ధర రూ.13,787. దీనితో పాటు అమ్మకం పన్ను రూ.1493. రవాణా రుసుము రూ. 897. అయితే నంబర్ ప్లేట్‌కు రూ.7 ఖర్చు అయిందట. ఇలా ప్రతి ఒక్క ఛార్జీలను కలిపి మొత్తం రూ.16,495కి అమ్మినట్టు తెలుస్తుంది. ఈ విషయం ఆ బిల్లులో స్ఫష్టంగా ఉంది. 1964లో ఈ కారును కొనుగోలు చేశారు. కాగా ఇప్పటికీ కొంతమంది వింటేజ్ కార్లను లైక్ చేసేవారు.. పాత అంబాసీడర్‌‌ కార్లను రీ మోడలింగ్ చేయించుకొని మరీ ఉపయోగిస్తున్నారు.