బాలీవుడ్Sridevi Biopic: శ్రీదేవి బయోపిక్ ను బోనీకపూర్ ఎందుకు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు? కారణమేంటి?

Sridevi Biopic: శ్రీదేవి బయోపిక్ ను బోనీకపూర్ ఎందుకు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు? కారణమేంటి?

Sridevi Biopic: నటి శ్రీదేవి బయోపిక్ తెరకెక్కించాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. కొందరు ఫిల్మ్ మేకర్స్ ఆ దిశగా ప్రయత్నాలు చేశారు కూడా. అయితే శ్రీదేవి భర్త బోనీ కపూర్ మాత్రం అందుకు ససేమిరా అంటున్నారు. అందుకు కారణాలు ఏమిటో చూద్దాం.. తమిళనాడులో పుట్టిన శ్రీదేవి చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టింది. టీనేజ్ లోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అందం, అభినయం, నాట్యం కలగలిపిన శ్రీదేవి కెరీర్లో వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇరవై ఏళ్ళు వచ్చే నాటికే సౌత్ ఇండియా టాప్ హీరోయిన్ గా వెలుగొందింది. అనంతరం ఆమె కన్ను బాలీవుడ్ పై పడింది.

అప్పట్లో బాలీవుడ్ అతిపెద్ద పరిశ్రమ. అక్కడ హీరోయిన్ గా సక్సెస్ అయితే ఇండియా వైడ్ ఫేమ్ వస్తుంది. అలాగే భారీగా రెమ్యూనరేషన్ తెలుసుకోవచ్చు. ఈ ఆలోచనతో హిందీ చిత్ర పరిశ్రమ మీద దృష్టి పెట్టింది. అక్కడ కూడా తన హవా నడిచింది. స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. బాలీవుడ్ కి వెళ్ళాక సౌత్ లో ఆమె పెద్దగా సినిమాలు చేయలేదు. ఏళ్ల తరబడి టాప్ పొజిషన్ లో ఉంది. నిర్మాత బోనీ కపూర్ ని వివాహం చేసుకున్న శ్రీదేవి ఇద్దరు అమ్మాయిలకు తల్లి అయ్యింది. వాళ్ళ పేర్లు జాన్వీ కపూర్, ఖుషి కపూర్.

శ్రీదేవి వయసు పెరిగాక లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో గృహిణి పాత్రలు చేసింది. తన ఏజ్ కి ఇమేజ్ కి సెట్ అయ్యే చిత్రాలు చేసింది. అనూహ్యంగా 2018 ఫిబ్రవరి 24న దుబాయ్ హోటల్ లో ప్రమాదవశాత్తు మరణించింది. బాత్ టబ్ లో స్పృహతప్పి పడిపోయిన శ్రీదేవి ఎవరూ గమనించకపోవడంతో చనిపోయారు. ఆమె మరణం తర్వాత శ్రీదేవి బయోపిక్ తెరకెక్కించాలనే వాదన తెరపైకి వచ్చింది. కానీ బోనీ కపూర్ అందుకు అంగీకరించడం లేదు.

తాజాగా ఆయన దీనిపై స్పందించారు. శ్రీదేవి చాలా ప్రైవేట్ గా ఉంటారు. ఆమె జీవితం కూడా ప్రైవేట్ గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అందుకే నేను బ్రతికి ఉన్నంత వరకు శ్రీదేవి బయోపిక్ కి అనుమతి ఇవ్వను అన్నారు. కాగా శ్రీదేవి జీవితంలో కొన్ని వివాదాలు ఉన్నాయి. ఆమె నటుడు మిథున్ చక్రవర్తిని రహస్యంగా వివాహం చేసుకున్నారనే వాదన ఉంది. ఈ విషయాన్ని మిథున్ చక్రవర్తి ఒకసారి ధృవీకరించారు. ఇలాంటి వివాదాలతో శ్రీదేవి కీర్తికి భంగం కలుగుతుందని బోనీ కపూర్ భవిస్తూ ఉండవచ్చు. అలాగే ఆమె మరణం కూడా మిస్టరీగా ఉంది..

Related News

Seetha Payanam Collection: డైరెక్టర్ గా హీరో అర్జున్ కష్టానికి ఫలితం సున్నా..’సీతా పయనం’ కలెక్షన్స్ ఎంతంటే!

Seetha Payanam Collection: ఒకప్పుడు యాక్షన్ హీరో గా సౌత్ ఇండియా లో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని ఏర్పాటు చేసుకున్న హీరో అర్జున్(Arjun Sarja). అందరూ ఆయన్ని యాక్షన్ కింగ్...

Prabhas: ప్రభాస్ అభిమానులకు చేదు వార్త..ఆ సినిమా ఇక రద్దు అయ్యినట్టే..కారణం ఏంటంటే!

Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) ప్రస్తుతం 'స్పిరిట్'(Spirit Movie), 'కల్కి 2'(Kalki 2 Movie), 'Fauji' చిత్రాలను పూర్తి చేయడం పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టాడు. ముందుగా ఆయన...

Most Popular

Dharmendra passes away: ఇండియన్ లెజెండరీ నటుడు ధర్మేంద్ర ఇకలేరు…

Dharmendra passes away: బాలీవుడ్ దిగ్గజ నటులలో ఒకరిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు ధర్మేంద్ర...కొద్దిరోజుల నుంచి శ్వాస సంబంధిత వ్యాధితో ఇబ్బంది పడుతున్న ఆయన గత కొద్దిసేపటికే ముంబైలోని ఒక హాస్పిటల్...

Bigg Boss 9 Telugu: మొదటి రోజే హౌస్ మేట్స్ తో మాస్క్ మ్యాన్ లొల్లి.. కొట్టేస్తాడా ఏంటి?

Bigg Boss 9 Telugu: ఎన్నో భారీ అంచనాల నడుమ నిన్న సాయంత్రం మొదలైన 'బిగ్ బాస్ 9'(Bigg Boss 9 Telugu) అప్పుడే యాక్షన్ మోడ్ లోకి వచ్చేసింది. నిన్న అక్కినేని...

South Indian directors in Bollywood: బాలీవుడ్ సౌత్ దర్శకుల వెంట ఎందుకు పడుతోంది..?

South Indian directors in Bollywood: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లందరు వాళ్ళ కంటు ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని సంపాదించుకుంటు ముందుకు సాగుతున్నారు. ఇక వాళ్ళందరూ ప్రస్తుతం బాలీవుడ్ బాట పడుతున్నారు....

Shilpa Shirodkar Comeback: మహేష్ మరదలు.. కెరీర్‌ నుంచి కుటుంబం వరకు స్ఫూర్తిదాయక ప్రయాణం!

Shilpa Shirodkar Comeback:శిల్పా శిరోద్కర్‌.. 1990వ దశకంలో బాలీవుడ్‌లో తన అభినయంతో గుర్తింపు పొందిన నటి. తన కెరీర్‌ ఉచ్ఛస్థితిలో ఉన్నప్పుడు సినిమాలకు విరామం ఇచ్చి, వ్యక్తిగత జీవితాన్ని ఎంచుకున్నారు. మిథున్‌ చక్రవర్తితో...

Kiara Advani Blessed with a baby girl:బిడ్డకు జన్మనిచ్చిన కియారా అద్వానీ..పాప ఎంత క్యూట్ గా ఉందో...

Kiara Advani Blessed with a baby girl: పాన్ ఇండియా లెవెల్లో యూత్ ఆడియన్స్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో కియారా అద్వానీ(Kiara Advani)...
Exit mobile version