Homeఎంటర్టైన్మెంట్సినిమా ఎనాలిసిస్Extra Jabardasth: నా వల్ల కాదు.. ఆ జబర్దస్త్ కమెడియన్ కి దండం పెట్టిన యాంకర్...

Extra Jabardasth: నా వల్ల కాదు.. ఆ జబర్దస్త్ కమెడియన్ కి దండం పెట్టిన యాంకర్ రష్మీ!

Extra Jabardasth: రష్మీ గౌతమ్ స్టార్ యాంకర్స్ లో ఒకరు. జబర్దస్త్ షో ద్వారా భారీ క్రేజ్ సంపాదించి. జబర్దస్త్ షో కారణంగా రష్మీ రేంజ్ మారిపోయింది. హీరోయిన్ గా కూడా హోదా దక్కించుకుంది. ప్రస్తుతం చేతినిండా షో లతో బిజీగా మారిపోయింది. దాదాపు పదేళ్లుగా తెలుగు షో లు చేస్తుంది రష్మీ గౌతమ్. అయినప్పటికీ ఆమెకు కొన్ని తెలుగు పదాలు స్పష్టంగా పలకడం రాదు. ఏదో మాట్లాడబోయి .. ఇంకేదో మాట్లాడి నవ్వుల పాలవుతుంది. కారణం రష్మీ గౌతమ్ ఒరియా అమ్మాయి.

వచ్చీ రానీ తెలుగుతో పదాలు ఖూనీ చేయడంలో రష్మీ తర్వాతే ఎవరైనా. తాజాగా ఎక్స్ట్రా జబర్దస్త్ షో లో పద్యం చదువుతూ నోరు తిరక్క పరువు పోగొట్టుకుంది. లేడీ కమెడియన్ రోహిణి టీం లీడర్ అయిన సంగతి తెలిసిందే. తాజా స్కిట్ లో రోహిణి ఓ తెలుగు టీచర్ గెటప్ లో కనిపించింది. కాగా టెన్త్ క్లాస్ లో ‘ ప్రవరుని స్వగతం ‘ పద్యాన్ని అనర్గళంగా చదివింది. నిజానికి ఈ పద్యం పలకడానికి కాస్త కష్టమే అయినా .. రోహిణి చాలా సులువుగా చదివేసింది.

ఆ పద్యం చదువుతుంటే రష్మీ నోరు వెళ్ళబెట్టింది. నువ్వు కూడా చదవాలంటూ రోహిణి, రష్మీ తో చెప్పింది. దీంతో రష్మీ తనతో కాదని దండం పెట్టింది. కానీ పట్టుబట్టడంతో చదవడానికి ప్రయత్నం చేసింది. ఆ పదాలు నోరు తిరగక నానా తిప్పలు పడింది. రష్మీ పద్యం చెప్తుంటే అంతా తెగ నవ్వారు. పైగా రోహిణి ఆమెపై పంచులు వేసి మరీ పరువు తీసింది. ఉల్లాసంగా, ఉత్సాహంగా అనమంటే .. లంగా, లెహంగా అన్నది అంటూ సెటైర్లు వేసింది.

ఇక ఇమ్మాన్యుయేల్ జూనియర్ ఎన్టీఆర్ ‘ ఆది ‘ మూవీ స్పూఫ్ చేశాడు. రాంప్రసాద్, బుల్లెట్ భాస్కర్ స్కిట్లు కూడా వినోదం పండిస్తున్నాయి. లేటెస్ట్ ప్రోమో మాత్రం చాలా ఫన్నీగా ఉంది. బాగా ఆకట్టుకుంటుంది. రష్మీ రియాక్షన్స్ హైలెట్ గా నిలిచాయి. కాగా రష్మీ ప్రస్తుతం సినిమా అవకాశాలు పెద్దగా లేవు. స్మాల్ స్క్రీన్ పై ఎక్కువ దృష్టి పెట్టినట్టుంది. ఈటీవీలో పలు షోలు, స్పెషల్ ఈవెంట్స్ హోస్ట్ చేస్తూ సందడి చేస్తుంది.

 

Extra Jabardasth Latest Promo | 5th April 2024 | Rashmi, Kushboo, Krishna Bhagavaan | ETV Telugu

Exit mobile version