Khushboo Patani: బేసిగ్గా ఎవరైనా కొంచెం అందంగా ఉన్న అమ్మాయి కనిపిస్తే ఈ అమ్మాయి అచ్చం హీరోయిన్ లా ఉంది అంటాం. లేదంటే ఈ అమ్మాయికి హీరోయిన్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటూ సామాన్య జనాలు మాట్లాడుకుంటూ ఉంటారు. నిజానికైతే సినిమాల్లో ఉన్న హీరోయిన్ల కంటే బయట ఉన్న చాలామంది అమ్మాయిలు మనకు చాలా అందంగా కనిపిస్తూ ఉంటారు.
అందులో డాక్టర్లు, టీచర్లు, ఆర్మీ ఆఫీసర్లు కూడా ఉండటం విశేషం. ఇక ఇది ఇలా ఉంటే ఒక అమ్మాయి మాత్రం తన అంద చందాలతో ఇన్ స్టా లో ఉన్న తన ఫాలోవర్స్ ని ఎప్పటికప్పుడు ఆక్టివేట్ చేస్తూ ఉంటుంది. అయితే వాళ్ళ అక్క హీరోయిన్ అయినప్పటికీ అక్కను తలదన్నే అందంతో చాలా క్యూట్ గా ఉండడమే కాకుండా చూసిన ప్రతి ఒక్క వ్యక్తి కళ్ళను ఆకర్షిస్తూ హీరోయిన్లకు సైతం ఏమాత్రం తీసిపోని అందంతో సోషల్ మీడియా లో రచ్చ రచ్చ చేస్తుంది.
ఇక వీళ్ళ అక్క పాన్ ఇండియా హీరోయిన్ కావడం విశేషం… ఇంతకీ ఈ అమ్మడు వాళ్ల అక్క ఎవరు అనుకుంటున్నారా? ఆమె దిశా పటాని…టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా పాన్ ఇండియాలో ఉన్న అన్ని లాంగ్వేజేస్ లో సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటి దిశా పటాని..ఇక ఆమె చెల్లె అయిన కుష్బూ పటాని ఆర్మీ ఆఫీసర్ గా తన బాధ్యతలను నిర్వర్తిస్తుంది. కుష్బూ పటాని ఉత్తరప్రదేశ్ లో పుట్టి పెరిగింది. బరేలిలో స్కూలింగ్ ని కంప్లీట్ చేసింది. ఇక ఈసీఈ లో ఇంజనీరింగ్ ని పూర్తి చేసుకున్న తర్వాత ‘ఆర్మీ సోల్జర్’ గా జాయిన్ అయింది. ఆ తర్వాత లెప్ట్ నెంట్ స్థాయికి కూడా చేరుకుంది.
ఇక 12 సంవత్సరాల పాటు ఆర్మీకి సేవలు అందించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంది. ఇక అక్క దిశాపటాని లాగే ఈమె కూడా చాలా స్లిమ్ గా ఫిట్ గా ఉండటం అనేది ఈమెకు కూడా చాలావరకు కలిసి వచ్చే అంశం అనే చెప్పాలి. మరి అక్క దిశా పటాని లాగే ఈమె కూడా ఇప్పుడు ఇండస్ట్రీ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే కుష్బూ పటాని ఆర్మీ డ్రెస్ లో ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.