Director Krish: పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పటి వరకు చాలా సినిమాలు వచ్చాయి. అందులో కొన్ని సినిమాలు సూపర్ సక్సెస్ అయితే మరికొన్ని సినిమాలు ఫ్లాప్ గా మిగిలాయి. నిజానికి ఆయన సినిమా హిట్ అయిన, ఫ్లాపైన కలెక్షన్ల వర్షం కురిపిస్తూ ఉంటాయి. అలాగే జనాల్లో విపరీతమైన క్రేజ్ ని కూడా సంపాదించుకుంటూ ఉంటాయి. అందుకే పవన్ కళ్యాణ్ అంటే ప్రతి ఒక్క ప్రేక్షకుడికి కూడా చాలా ఇష్టం… ఇక ఆయన అభిమానుల గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అయితే లేదు.
ఎందుకంటే వాళ్లు ఎప్పుడు ఆయనని అభిమానిస్తూనే ఉంటారు తప్ప ఆయన సినిమాలు ఫ్లాప్ అయ్యాయని ఆయన్ని ఎప్పుడు దూషించరు. అందుకే ఆయనకు అభిమానుల కంటే కూడా భక్తులు ఉంటారని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ గత నాలుగు సంవత్సరాల కిందట మొదలుపెట్టిన హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఇప్పుడు వదులుతున్నారు. ఇక మే 2 వ తేదీన ఉదయం 9 గంటలకి ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ రీసెంట్ గా ఒక పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు.
ఇక అందులో భాగంగానే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ సినిమా పైన చాలా అంచనాలను రేకత్తించే విధంగా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి డైరెక్టర్ క్రిష్ తప్పకున్నట్టుగా వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే టీజర్ అప్డేట్ కోసం ఒక పోస్టర్ ను రిలీజ్ చేసినప్పుడు అందులో పవన్ కళ్యాణ్ అలాగే ఈ సినిమా ప్రొడ్యూసర్ అయిన ఎ ఎం రత్నం పేరు ను మెన్షన్ చేశారు.
కానీ డైరెక్టర్ అయిన క్రిష్ పేరు మాత్రం మెన్షన్ చేయలేదు. అయితే ఈ సినిమా నుంచి క్రిష్ తప్పుకున్నాడనే అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి… మరి దీనికి సంబంధించిన సరైన క్లారిటీ రావాలంటే ఈ విషయం పైన సినిమా యూనిట్ స్పందించాల్సిన అవసరమైతే ఉంది…