Jiah Khan: సినిమా ఇండస్ట్రీ ఓ పెద్ద రంగుల ప్రపంచం. ఇందులో ఎదగాలని వస్తారు కానీ అనుకోకుండా కొందరు వెనక్కు వెళ్తే మరికొందరు మాత్రం స్టార్లుగా ఎదుగుతారు. ఇక కొందరు ప్రేమ, పెళ్లి, విడాకులు అంటూ కెరీర్ ను నాశనం చేసుకుంటారు. ఇలాంటి వారిలో జియా ఖాన్ ఒకరు అని చెప్పవచ్చు. ఈ పేరు చెబితేనే ఇప్పుడు టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా వచ్చి ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగింది జియా. కానీ 25 సంవత్సరాల వయసులోనే ప్రేమలో పడి తన కెరీర్ నే కాదు ప్రాణాలను కోల్పోయింది.
2013 జూన్ 3న తన నివాసంలో ఆత్మహత్య చేసుకుంది జియా. ఈమె మరణంపై ఆమె తల్లి పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఆమె ప్రియుడు, నటుడు ఆదిత్య పంచోలిని అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రస్తుతం జియా రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన లెటర్ లో ఏముందంటే.. నేను ఇప్పటికే చాలా కోల్పోయాను. ఇంకా కోల్పోవడానికి ఏం లేదని.. ఈ లెటర్ చదివే సమయానికి నేను ఈ లోకంలో ఉండను అంటూ రాసింది. నిన్ను ఎంతో ప్రేమించి చివరికి నన్నే నేనే కోల్పోయాను అంటూ రాసుకొచ్చింది.
తన మనసు ముక్కలు చేశాడని.. తనతో జీవితం పంచుకోవాలని కలలు కన్నట్టు తెలిపింది. కానీ తనను మానసికంగా చంపేశాడని..దీంతో తనకు భవిష్యత్తు కనిపించడం లేదని బాధ పడింది. తనపై ఎనలేని ప్రేమ చూపిస్తే చివరకు తననే మోసం చేసినట్లు రాసింది. అబద్ధాలు, నమ్మక ద్రోహం, నిత్యం చిత్రవధ చేస్తూ ఇబ్బంది పెట్టాడట. తిండి, నిద్ర లేకుండా చేశాడట. కెరీర్ పోయిందని అన్నింటికి దూరం అయ్యాను అని ఆవేదన చెందింది. విధి ఎందుకు మనిద్దరిని కలిపిందో అంటూ బాధ పడింది.
శారీరకంగా దాడి చేసి, హింసించాడట. ఇదంతా నాకే ఎందుకు జరిగింది. ఇంకా శారీరకంగా, మానసికంగా చంపేస్తావేమో అని భయం ఉందని.. అమ్మాయిలతో జల్సా చేయడమే నీ జీవితం కానీ నేను మాత్రం నిన్ను ప్రాణంగా ప్రేమించాను అంటూ బాధ పడింది. ఎంత బాధపెట్టిన నువ్వే కావాలి అనుకున్నానని..తను మారడు అని తెలిసి.. కలలకు, తన జీవితానికి గుడ్ బై చెప్పాలి అనుకుందట. అయితే తనను ప్రేమిస్తున్న ప్రారంభంలోనే మోసపోతావు అనే మెసేజ్ వచ్చిందట కానీ నమ్మలేదట. చివరకు అదే నిజం అయిందని..తెలిపింది.
అబార్షన్ కూడా జరిగిందట. దీంతో కుంగిపోయిందట. జీవితాన్ని నాశనం చేసినా కానీ తనకోసమే ఎదురుచూసి ఎంతగానో ఏడ్చిందట. ఇప్పుడు తను ఒంటరి అని.. అందుకే శాశ్వతంగా నిద్రపోవాలి అనుకున్నాను అంటూ జియా ఖాన్ చివరి లేఖ రాసింది. ఈ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.