spot_img
Homeబాలీవుడ్Ram Charan: రామ్ చరణ్ కి పోటీ ఇచ్చే బాలీవుడ్ హీరో అతనే అంటున్న క్రిటిక్స్...

Ram Charan: రామ్ చరణ్ కి పోటీ ఇచ్చే బాలీవుడ్ హీరో అతనే అంటున్న క్రిటిక్స్…

Ram Charan: సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులు వరుసగా సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకొని అందరికంటే వాళ్లే టాప్ రేంజ్ లోకి వెళ్లాలి అని అనుకుంటూ ఉంటారు. అయితే వాళ్ళు స్క్రిప్ట్ సెలక్షన్ లో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నప్పటికీ కొన్ని అనుకోని కారణాల వల్ల ప్లాప్ లు అనేవి వస్తూ ఉంటాయి.

ఇక మంచి నటులు గా గుర్తింపు పొందిన వాళ్ళకి కూడా సినిమాలు సక్సెస్ అవ్వకపోతే వాళ్ళు స్టార్ హీరోలుగా ఎదగలేక పోతారు. ఇక కొందరికి యాక్టింగ్ సరిగ్గా రాకపోయిన కూడా సక్సెస్ లు రావడంతో స్టార్లుగా వెలుగొందుతారు. అయితే ఇండస్ట్రీలో అల్టిమేట్ గా చూసేది సక్సెస్ లు మాత్రమే కాబట్టి సక్సెస్ ఎవరికైతే ఉంటుందో వాళ్ల చుట్టే దర్శక, నిర్మాతలు తిరుగుతూ ఉంటారు. ఇక ఇదిలా ఉంటే రామ్ చరణ్ లాంటి నటుడు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అతనికి యాక్టింగ్ సరిగ్గా రాదు అంటూ విమర్శలను ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ ‘రంగస్థలం’ సినిమాతో తన నటనలోని పరిణితిని చూపించి స్టార్ హీరోగా ఎదిగాడు. అలాగే ‘త్రిబుల్ ఆర్’ సినిమాలో తన నటనకి యావత్ ప్రపంచం మొత్తం ఫిదా అయిపోయిందనే చెప్పాలి.

ఇక బాలీవుడ్ దిగ్గజ హీరో అయిన రన్బీర్ కపూర్ కూడా చాలా మంచి నటుడు. ఆయన ప్రస్తుతం రామాయణం సినిమాని చేస్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి రామ్ చరణ్ కి పోటీ ఇచ్చే హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది రన్బీర్ కపూర్ అని చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళిద్దరూ నటన పరంగా ఒక్కొక్క పాత్రలో చాలా పరిణితిని చూపిస్తూ వైవిధ్యాన్ని కనబరుస్తూ నటిస్తున్నారు. అలాగే త్రిబుల్ ఆర్ సినిమాలో రామ్ చరణ్ చివర్లో రాముడి అవతారంలో కనిపించి ప్రేక్షకులందరిని కట్టిపడేశాడు. ఇక దానికి తోడుగా ఇప్పుడు రన్బీర్ కపూర్ కూడా ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. దానివల్లే వీళ్లిద్దరిని పోలుస్తూ రామ్ చరణ్ కి పోటీ ఇచ్చే స్టార్ హీరో రన్బీర్ కపూర్ అంటూ భారీ ఎత్తున సోషల్ మీడియాలో కామెంట్లైతే వినిపిస్తున్నాయి.

నిజానికి రామ్ చరణ్ స్ట్రాటజీ వేరు, రన్బీర్ కపూర్ స్ట్రాటజీ వేరు వీళ్లిద్దరూ సినిమాల పరంగా డిఫరెంట్ వేరియేషన్స్ ను ఎంచుకొని సక్సెస్ లను కొడుతూ ఉంటారు. కాబట్టి వీళ్ళ మధ్య పోలిక అనేది సరైనది కాదు అంటూ కొంతమంది సినీ విశ్లేషకులు కూడా వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. కానీ మొత్తానికైతే రన్బీర్ కపూర్, రామ్ చరణ్ ఇద్దరు కూడా ఇండియాలో స్టార్ హీరోలు కావడం విశేషం…ఇక రీసెంట్ గా రన్బీర్ కపూర్ హీరోగా వచ్చిన అనిమల్ సినిమా దాదాపు 900 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టి సూపర్ హిట్ గా నిలిచింది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...

Akhil Akkineni : ముద్దు అడిగిన యంగ్ హీరోయిన్.. వార్నింగ్ ఇచ్చిన అఖిల్.. వీడియో వైరల్..

Akhil Akkineni : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అఖిల్...

Lenin 2 Weeks Collections: ‘లెనిన్’ 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు.. టార్గెట్ కి ఆమడదూరం లో...

Lenin 2 Weeks Collections: అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' చూస్తూ ఉండగానే 2 వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. అక్కినేని అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ, మొదటి...

Jabardasth Naresh: ఆ ఇద్దరు రహస్యాలు మొత్తం నాకు తెలుసు అంటూ పెద్ద బాంబు పేల్చిన జబర్దస్త్ నరేష్..

Jabardasth Naresh: 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకున్న కమెడియన్స్ లో ఒకరు నరేష్. చూసేందుకు చాలా చిన్నపిల్లవాడు లాగా కనిపిస్తాడు కానీ , ఇతని వయస్సు పాతికేళ్ల...

Jana Nayagan: ‘జన నాయగన్’ థియేటర్ లో గుండెలు పగిలేలా ఏడ్చిన మహిళ.. వీడియో వైరల్..

Jana Nayagan: కొన్ని సినిమాలు హిట్ / ఫ్లాప్ తో సంబంధం లేకుండా అభిమానుల హృదయాలను హత్తుకునే మధురమైన అనుభూతులు కలిగిస్తుంటాయి. వాటి నుండి మనం ఎప్పటికీ బయటకు రాలేము. ప్రతీ స్టార్...
Oktelugu Epaper
Exit mobile version