Homeబాలీవుడ్Ananya Panday: కొత్త కార్ కొన్న బాలీవుడ్ బ్యూటీ...కార్ నెంబర్ స్పెషాలిటీ ఏంటో తెలుసా..?

Ananya Panday: కొత్త కార్ కొన్న బాలీవుడ్ బ్యూటీ…కార్ నెంబర్ స్పెషాలిటీ ఏంటో తెలుసా..?

Ananya Panday: బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటీమణులు చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో అనన్య పాండే ఒకరు. విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘లైగర్ ‘ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఇక ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కానప్పటికీ ఆమెకు నటిగా మాత్రం మంచి గుర్తింపు అయితే వచ్చింది. ఇక ఆ సినిమా ఇచ్చిన ఫేమ్ తోనే మరికొన్ని సినిమాల్లో నటించినప్పటికీ సక్సెస్ లు మాత్రం రావడం లేదు. ఇక ఇది ఇలా ఉంటే ఆమె సినిమా కెరియర్ ని పక్కన పెడితే ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూనే పలు రకాల వివాదాల్లో చిక్కుకుంటూ ముందుకు సాగుతుంది. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ అమ్మడు మూడు కోట్లు పెట్టి రేంజ్ రోవర్ కార్ ను కొనుగోలు చేసింది. అయితే కార్ ను కొనడం లో పెద్ద ప్రత్యేకత ఏమీ లేదు. కానీ ఈ రోజుల్లో చాలామంది హీరోయిన్స్ ఇండస్ట్రీ కి వచ్చిన మొదట్లోనే లగ్జరీ కార్లను కొంటున్నారు. అనన్య కూడా అదే చేసింది. కానీ ఆ కార్ కోసం తీసుకున్న నెంబర్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అయితే ఆమె కొన్ని డబ్బులు వెచ్చించి మరి 3000 నెంబర్ ని కొనుగోలు చేసింది. అయితే ఈ నెంబర్ ని ప్రత్యేకించి కొనుగోలు చేయడానికి గల కారణం ఏంటి అంటూ పలువురు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఈ నెంబర్ ని ఆమె కొనుగోలు చేయడంలో కారణమేమిటి అంటే అక్టోబర్ 30వ తేదీన ఆమె జన్మించింది.

కాబట్టి ఆ నెంబర్ కలిసేలా కార్ కోసం ఈ నెంబర్ ను తీసుకొని ఉంటుందని పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇది కాకుండా హాలీవుడ్ మార్వెల్ సినిమాలోని బోరో లైన్ కోసం ఈ నెంబర్ ప్లేట్ ను తీసుకొని ఉంటుందని తెలుస్తుంది. ఇక దాంట్లో ‘ఐ లవ్ యూ 3000’ అనే డైలాగ్ వస్తుంది. ఇక ఎవెంజర్స్ ఎండ్ గేమ్ లో ఐరన్ మ్యాన్ ఈ డైలాగ్ వాడుతారు… ఇక మొత్తానికైతే అనన్య ఏదో ఒకటి చేస్తూ తరుచుగా వార్తల్లో నిలవడం తనకు అలవాటైపోయింది. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా అంబానీ వివాహ వేడుకలో పాల్గొన్న ఆమె హార్థిక్ పాండ్య తో కలిసి కనిపించింది.

దాంతో వీళ్లిద్దరూ రిలేషన్ షిప్ లో ఉంటున్నారనే వార్తలైతే వస్తున్నాయి. ఇక గత కొద్ది రోజుల నుంచి ఈ వార్తలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇక ఇన్ స్టాగ్రామ్ లో కూడా ఆమె హార్ధిక్ ను ఫాలో అవుతుంది. హర్ధిక్ కూడా తనను ఫాలో అవుతున్నాడు. ఇక దాంతో ప్రస్తుతం వీళ్లిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారనే విషయానికి స్పష్టత దొరికింది… ఇక మొత్తానికైతే అనన్య పాండే ప్రస్తుతం సినిమాల్లో మెప్పించలేకపోయిన కూడా తన హాట్ హాట్ లుక్స్ తో ఇన్ స్టా లో తన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులతో పాటు సినిమా హీరోలకు, దర్శకులకు చెమటలు పట్టిస్తుందనే చెప్పాలి.

ఇక ప్రస్తుతం ఆమె చేస్తున్న కొన్ని సినిమాలు సెట్స్ మీద ఉన్నప్పటికీ ఆ సినిమాలతో కూడా తను సక్సెస్ సాధిస్తుందా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది. ఇక ఆమెకు తెలుగులో కూడా కొన్ని ఆఫర్లు వస్తున్నాయనే వార్తలైతే వినిపిస్తున్నాయి. కానీ అవి ఏవి కూడా కార్యరూపం దాల్చడం లేదు. చూడాలి మరి అనన్య పాండే తన కెరియర్ లో ఎలాంటి టాప్ పొజిషన్ కి వెళుతుంది అనేది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version