Sivaji: నటనకు దూరమైనా శివాజీ సడన్ గా బిగ్ బాస్ షోలో ప్రత్యక్షం అయ్యాడు. ఆయన్ని జనాలు మర్చిపోగా తిరిగి పాపులారిటీ రాబట్టాడు. అలాగే ‘నైంటీస్ మిడిల్ క్లాస్ బయోపిక్’ వెబ్ సిరీస్ తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. ఈ వెబ్ సిరీస్ ఓటీటీలో దుమ్మురేపింది. దీంతో శివాజీకి ఆఫర్లు క్యూ కట్టాయి. వరుసగా సినిమాలు సైన్ చేస్తున్నాడు. కెరీర్ సక్సెస్ ఫుల్ గా ముందుకు వెళ్లేందుకు ప్లానింగ్ చేసుకుంటున్నాడు.
స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇక తాజాగా శివాజీ పెట్టిన పోస్ట్ ఆసక్తి కలిగిస్తుంది. డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తో కలిసి ఉన్న కొన్ని ఫోటోలు ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు.’ సర్ప్రైజ్ కోసం రెడీగా ఉండండి. చేయబోయేది ఏంటో తెలిస్తే మీకు మాటలు కూడా రావు ‘ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. కాగా ఈ ఫొటోల్లో శివాజీ, తరుణ్ భాస్కర్ క్రికెట్ బ్యాట్స్ పట్టుకుని కనిపించారు.
కాగా ఈ పోస్ట్ తన నెక్స్ట్ సినిమా గురించా లేక ఇంకేమైనా అన్నది క్లారిటీ ఇవ్వలేదు. దీంతో నెటిజన్స్ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇద్దరి కాంబోలో ఏదైనా మూవీ చేస్తున్నారా .. లేక ఏదైనా సెలెబ్రెటీ క్రికెట్ మ్యాచ్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నారా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి దీని అర్థం ఏంటో తెలియాలంటే వేచి చూడాల్సిందే. బిగ్ బాస్ ద్వారా వచ్చిన పాపులారిటీ పెంచుకునే పనిలో ఉన్నాడు శివాజీ.
పలు స్క్రిప్ట్స్ వింటూ నెక్స్ట్ సినిమా లైన్ లో పెట్టడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఒకప్పుడు ఇండస్ట్రీలో టైర్ టు హీరోగా వెలిగిన శివాజీ .. పొలిటికల్ టర్న్ తీసుకుని జీరో గా మారాడు. తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇక బిగ్ బాస్ షో పుణ్యమా అని ఒక పాజిటివ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. అందరి మనసు గెలుచుకుని ఫైనలిస్ట్ గా నిలిచాడు శివాజీ. అతడికి మూడో స్థానం దక్కింది. పల్లవి ప్రశాంత్ విన్నర్ కాగా, అమర్ దీప్ రన్నర్ అయ్యాడు.
Web Title: Bigg boss shivaji shocking post
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com