BJP: గతంలో జరిగిన అయిదు స్టేట్ల ఎన్నికల్లో పార్టీలు పెద్ద మొత్తంలో ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. పశ్చిమబెంగాల్, తమిళనాడు, అసోం, పుదుచ్చేరి, కేరళ స్టేట్లకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ రూ.252 కోట్లు ఖర్చు చేసింది. కేంద్ర ఎన్నికల సంఘానికి అందిన నివేదిక ప్రకారం బెంగాల్ ఎన్నికల ప్రచారం కోసమే 60 శాతం నిధులు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.

పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ ని ఢీకొనే క్రమంలో బీజేపీ పెద్ద మొత్తంలో ఖర్చు చేసినట్లు సమాచారం. కానీ బీజేపీ కంటే తృణమూల్ కాంగ్రెస్ ఎక్కువ ఖర్చు చేసిందని తెలుస్తోంది. బీజేపీ రూ.151 కోట్లు ఖర్చు చేస్తే టీఎంసీ మాత్రం రూ.155 కోట్లు ఖర్చు చేసిందని నివేదిక చెబుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల ఖర్చు భారం పెరుగుతూ పోతోంది.
బీజేపీ బెంగాల్ లో రూ.151 కోట్లు, అసోంలో రూ.44 కోట్లు, పుదుచ్చేరిలో రూ.5 కోట్లు, తమిళనాడులో రూ.23 కోట్లు ఖర్చు చేసింది. కానీ బీజేపీ సాధించిన ఓట్లు మాత్రం 2.6 శాతమే అని తెలుస్తోంది. కేరళలో బీజేపీ రూ. 30 కోట్లు ఖర్చు చేసింది. ఈ మేరకు ఎన్నికల సంఘానికి ఇచ్చిన నివేదికలో పార్టీ పొందుపరిచాయి. బెంగాల్ లో టీఎంసీ 200 స్థానాల్లో విజయం సాధించగా బీజేపీ 70 స్థానాల్లో గెలిచింది.
Also Read: Chennai Rains: తమిళనాడు కన్నీటిసాగరం.. ఎస్ఐ రాజేశ్వరి చూపిన సాహసం.. వైరల్ వీడియో
అయినప్పటికి బెంగాల్ లో హోరాహోరీ ప్రచారం సాగింది. ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా తదితరులు సుడిగాలి పర్యటన చేసినా బీజేపీ అంచనాలు అందుకోలేకపోయింది. ప్రతిపక్షానికే పరిమితమైంది. దీంతో బెంగాల్ లో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ తాపత్రయపడుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై పోరు సాగిస్తూనే ఉంది.
Also Read: KCR VS BJP: బీజేపీ బుట్టలో పడిందా? కేసీఆర్ ప్లాన్ సక్సెస్?