Homeబిగ్ బాస్ 5 అప్‌డేట్స్Bigg Boss: అరెయ్ ఏంట్రా ఇదీ.. బిగ్ బాస్ లో హగ్గుల జాతర..!

Bigg Boss: అరెయ్ ఏంట్రా ఇదీ.. బిగ్ బాస్ లో హగ్గుల జాతర..!

Bigg Boss: బిగ్ బాస్ 5 సీజన్ తెలుగు చివరి దశకు చేరుకుంది. వారానికి ఒకరు ఎలిమినేట్ అవుతూ చివరికీ ఏడుగురు మాత్రమే బిగ్ బాస్ షోలో మిగిలారు. మరో ఐదారు వారాల్లో బిగ్ బాస్ విన్నర్ ఎవరో తెలిపోనుంది. దీంతో బిగ్ బాస్ లో ఉండే కంటెస్టెంట్ విన్నర్ అయ్యేందుకు పోటీ పడుతున్నారు. అందరి అటెన్షన్ ను తమవైపు తిప్పుకునేందుకు కంటెస్టెంట్ మితిమీరి ప్రవర్తిస్తున్నారు.

Bigg Boss
Bigg boss 5 Shanmukh and Siri

యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్, యాంకర్ సిరిలు హౌస్ లో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. వీరిద్దరు నిత్యం కలిసి ఆడటం, తిట్టుకోవడం, కొట్టుకోవడం మొదట్లో కన్పించింది. బిగ్ బాస్ లోకి ఎంట్రీ కావడానికి ముందే వీరిద్దరు కలిసి పని చేయడంతో వీరిమధ్య స్నేహమే ఉందని అంతా భావించారు. షణ్నుఖ్ సైతం తమది స్నేహమేనంటూ పలుమార్లు చెప్పుకొచ్చాడు.

కానీ బిగ్ బాస్ లో వీరిద్దరినీ చూసిన వాళ్లకు మాత్రం అది ఫ్రెండ్ షిష్ కాదని ఇంకేదో వీరి మధ్య నడుస్తుందనిపించేలా ప్రవర్తిస్తున్నారు. కొట్టుకోవడం, తిట్టుకోవడం నుంచి నిత్యం హగ్గులు, ముద్దులు, రోమాన్స్ సీన్స్ తో హౌస్ లో హీట్ పుట్టిస్తున్నారు. అంతకముందు సింగర్ శ్రీరామ్ సైతం ఓ అమ్మాయితో లవ్ ట్రాక్, హగ్గులతోనే వార్తల్లో నిలిచాడు.

తాజాగా బిగ్ బాస్ ‘టికెట్ టు ఫినాలే’ రెండో దశలో భాగంగా టాస్క్ నిర్వహించాడు. ఇందులో మానస్ తొలి స్థానంలో నిలువగా షణ్ముఖ్ సెకండ్, సిరి మూడు, శ్రీరామ్ నాలుగు, ప్రియాంక్ ఐదు, కాజల్ ఆరు, సన్నీ ఏడు స్థానాల్లో నిలిచారు. టాప్ 3లో తమ పేర్లు ఉండటంతో సిరి షణ్ముఖ్ మరోసారి ఆనందంతో హగ్ చేసుకున్నారు.

Also Read: ఈ వారం ఆ ఇద్దరిలో ఏ లేడీకి మూడిందో ?

ఐస్ టాస్క్ లో భాగంగా సిరికి, శ్రీరామ్ కు గాయలయ్యాయి. ఇక షణ్ముఖ్ కు ఒంట్లో బాగాలేకపోయిన సిరిని మంచం దిగకుండా అన్ని సపర్యాలు చేస్తున్నాడు. దీనికి కృతజ్ఞతగా సిరి హగ్గుల మీద హగ్గులు ఇస్తోంది. షణ్ముఖ్ వద్దంటున్నా అతడి మీద అలకబూని మరీ ముద్దులు పెట్టేస్తోంది. ఈ సమయంలో కెమరావైపు చూస్తూ షణ్ముఖ్ ఇది కేవలం ఫ్రెండ్ షిప్ హగ్గే ఆంటీ అని చెబుతాడు.

దీనికి సిరి ‘మా మమ్మీకి తెలిసిపోయి ఉంటుంది.. ఇప్పుడు అర్ధమై ఉంటుంది.. వాడికి బాలేకపోయినా నన్ను ఎంత బాగా చూసుకుంటన్నాడోనని.. నాకు తెలిసి ఇలా ఎవరూ ఉండరంటూ చెప్పుకొచ్చింది.’ ఫ్యామిలీ ఆడియన్స్ చూసే బుల్లితెరపై నిత్యం హగ్గులు, ముద్దుల గోలా ఏంట్రా? అంటూ కొందరు తలలు పట్టుకున్నారు. మరికొందరు లోలోపల ఎంజాయ్ చేస్తున్నారు. మొత్తానికి బిగ్ బాస్-5 సీజన్ ను కంటెస్టెంట్స్ రచ్చ రంబోలాగా మార్చేస్తున్నారు.

Also Read: బిగ్ బాస్ టైటిల్ మా క్యాస్ట్ వాడే కొట్టాలి… అరె ఎటు పోతుందిరా ఈ సమాజం!

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version