Akhanda Movie : “అఖండ”పై తారక్ రివ్యూ వైరల్.. థియేటర్లు సీజ్!

Akhanda Movie : మాస్ ఫ్యాన్స్ గూస్ బమ్స్ చేయాలంటే.. బాలయ్యే! నట సింహం డెలాగ్ డెలివరీకి.. డీటీఎస్ రీ-సౌండ్ ఇవ్వాల్సిందే. హార్డ్ కోర్ ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోవాల్సిందే. బాలయ్య సినిమా రిలీజ్ రోజున థియేటర్లో కనిపించే అరాచకం ఇలాగే ఉంటుంది. అఖండ సినిమా విడుదల వేళ ఏపీలో థియేటర్లు ఇలాగే దద్దరిల్లాయి. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో.. అభిమానుల ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. పలువురు స్టార్ హీరోలు కూడా ఈ చిత్ర విజయంపై స్పందించడంతో పండగ […]

Written By: Bhaskar, Updated On : December 3, 2021 10:03 am
Follow us on

Akhanda Movie : మాస్ ఫ్యాన్స్ గూస్ బమ్స్ చేయాలంటే.. బాలయ్యే! నట సింహం డెలాగ్ డెలివరీకి.. డీటీఎస్ రీ-సౌండ్ ఇవ్వాల్సిందే. హార్డ్ కోర్ ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోవాల్సిందే. బాలయ్య సినిమా రిలీజ్ రోజున థియేటర్లో కనిపించే అరాచకం ఇలాగే ఉంటుంది. అఖండ సినిమా విడుదల వేళ ఏపీలో థియేటర్లు ఇలాగే దద్దరిల్లాయి. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో.. అభిమానుల ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. పలువురు స్టార్ హీరోలు కూడా ఈ చిత్ర విజయంపై స్పందించడంతో పండగ చేసుకుంటున్నారు.

అఖండ చిత్రం.. ఫ్యాన్స్ తోపాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంటోంది. ఈ చిత్రం గురించి సూపర్ స్టార్ మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలు కూడా ప్రశంసలు కురిపించారు. ఆ తర్వాత టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు. ఈ మేరకు అయన స్పెషల్ ట్వీట్ చేశారు.

అఖండ చిత్రాన్ని చూసిన తర్వాత ఎన్టీఆర్ ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని షేర్ చేశారు. “ఇప్పుడే అఖండ మూవీ చూశాను. కంగ్రాట్స్ బాల బాబాయ్.. ఈ అద్భుతమైన విజయం అందుకున్న చిత్ర బృందానికి అబినందనలు.. హార్డ్ కోర్ ఫ్యాన్స్ కు ఇవి ఆనంద క్షణాలు” అని రాసుకొచ్చారు. ఆ తర్వాత చంద్రబాబు కూడా ట్విట్టర్లో.. అఖండ విజయం సాధించిన అఖండ హీరో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీనివాసరావు, చిత్ర యూనిట్ కు, అభిమానులకు అభినందనలు అంటూ రాసుకొచ్చారు చంద్రబాబు.

ప్రముఖుల నుంచి ఈ విధమైన స్పందన రావడంతో.. ఫ్యాన్స్ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ప్రస్తుతం ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ మూవీ సక్సెస్ మీట్ కు తారక్ వస్తాడనే ప్రచారం కూడా సాగుతోంది. ఇదిలా ఉంటే.. అఖండ సినిమా ప్రదర్శించిన రెండు థియేటర్లను అధికారులు సీజ్ చేశారు. బెనిఫిట్ షోలు, టిక్కెట్ల ధరలపై ప్రభుత్వం చట్టం తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ నిబంధనలను ఉల్లంఘించి రెండు థియేటర్లు బెనిఫిట్ షోలు వేయడంతో.. అధికారులు వాటిని సీజ్ చేశారు.