OTT: ఇటీవల కాలంలో ఓటీటీల హవా జోరుగా పెరిగిపోయింది. కరోనాతో థియేటర్లు మూతపడిపోవడంతో ప్రేక్షకులంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ క్రమంలోనే ప్రేక్షకుల దగ్గరకే వినోదం అంటూ ఓటీటీల్లోనే సినిమాలను విడుదల చేయడం ప్రారంభించారు దర్శకనిర్మాతలు. ఈ నేపథ్యంలోనే వెబ్‌సిరీస్‌ల జోరు బాగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే పలు వెబ్‌సిరీస్‌లు మంచి క్రేజ్ దక్కించుకున్నాయి. వాటిల్లో మనీ హెయిస్ట్, ఇన్సైడ్ ఎడ్జ్ కూడా టాప్‌లో ఉన్నాయి. అమెజాన్, నెట్‌ఫ్లిక్స్‌లో ఈ వెబ్‌సిరీస్‌లు కోకొల్లలుగా పుట్టుకొస్తున్నాయి. విభిన్న కాన్సెప్టులతో.. టైం ట్రావెల్, దోపిడి, డ్రగ్స్, వైలెన్స్ ఇలా రకరకాల కోణాల్లో కథను రూపొందించి సిరీస్‌లను తెరకెక్కిస్తున్నారు.
తాజాగా, ఈ వెబ్‌సిరీస్‌లకు సంబంధించిన తర్వాత సీజన్లు విడుదలకు సిద్ధమయ్యాయి.. ప్రైమ్‌లో ఇంట్రెస్టింగ్ వెబ్‌సిరీస్ ఇన్సైడ్ ఎడ్జ్ సీజన్ 3 విడుదలైంది. మరోవైపు గ్లోబల్ హిట్ సిరీస్ మనీ హెయిస్ట్ చివరి సీజన్5 నుంచి రెండో భాగం ఈరోజు మధ్యాహ్నం 1.30 నిమిషాలకు నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ రెండు సినిమాలతో ఓటీటీ ప్రేక్షకులకు మంచి ట్రీట్ దక్కనుందని తెలుస్తోంది.
ఇన్సైడ్ ఎడ్జ్ క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించిన సంగతి తెలిసిందే. భారతీయ ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన ఐపీఎల్ బ్యాక్‌డ్రాప్‌లోనే బెట్టింగ్స్, తదితర అంశాలతో రసవత్తర డ్రామాతో ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. కాగా, బ్యాంక్ రాబరీలో జరిగే అంశాలను.. అక్కడ ఓ గ్యాంగ్ ఉపయోగించే తెలివితేటలు.. ఆ గ్యాంగ్‌ను ముందుండి నడిపించే వ్యక్తి ఆలోచనా శక్తి.. ఇవన్నీ సిరీస్‌ను ఉత్కంఠ తెప్పిస్తాయి. అదే మనీహేయిస్ట్.