Also Read: బిగ్ బాస్ టాప్ 5 కంటెస్టెంట్స్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? ఎవరికి ఎక్కువంటే?
సన్నీ పక్కన మాట్లాడుతూ.. తన ఫోన్లో ఓ క్లిప్‌ను చూపించేందుకు పోన్ పట్టుకున్నారు.. అయితే, ఆ ఫోన్ సిస్టమ్‌కు కనెక్ట్ అయి ఉంటంతో కొద్దిగా షాక్ కొట్టింది. దీంతో తన చేతిని సన్నీ వెనక్కి లాగేసుకున్నాడు. ఈ ఘటనలో ఎవ్వరికీ ఎటువంటి హాని జరగలేదు. అయితే, ఇది చిన్నపాటి ఘటనే అయినప్పటికీ.. సన్నీ ఫ్యాన్స్ మాత్రం ఈ వీడియోను సోషల్‌మీడియాలో వైరల్‌గా మార్చేశారు.
మొదట రిపోర్టర్‌గా కెరీర్ మొదలుపెట్టిన సన్నీ.. ఆ తర్వాత యాంకర్‌గా ఎదిగి.. బిగ్‌బాస్ షోతో ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. ఈ క్రమంలోనే తొలుత సన్నీకి హౌస్‌తో పాటు, ప్రజల్లో కాస్త నెగిటివిటీ వచ్చినా.. మెల్లగా అతనిపై జనాల్లో క్రేజ్ పెరగడం మొదలైంది. ఓటింగ్ ప్రాసెస్‌లో నెగ్గుతూ… చివరకు హౌస్మేట్స్ అందర్నీ దాటుకుని విన్నర్‌గా నిలిచాడు. ఈ క్రమంలోనే తనకు అండగా నిలిచిన హౌస్మేట్స్, ప్రేక్షకులతో పాటు నాగార్జునకు ధన్యవాదాలు తెలిపారు. ఈ విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నాడు.
Also Read: షణ్ముఖ్, సిరి రిలేషన్‌పై క్లారిటీ ఇచ్చిన సన్ని