TV9 Journalist: టీవీ9 తెలుగు న్యూస్ చానెల్స్ లో నంబర్ 1గా ఎదిగిందంటే దానివెనుక దాని వ్యవస్థాపకులు రవిప్రకాష్ తెలివితేటలున్నాయి. ఆయన రాజకీయ పార్టీలు, వ్యక్తులు, వ్యాపారులతో కలిసి సంస్థను భారీ వృక్షంగా తీర్చిదిద్దారు. తెలుగులోనే కాదు.. ప్రాంతీయ భాషలు, హిందీలోనూ విస్తరించి దేశంలోనే ఒక ప్రముఖ మీడియా వ్యవస్థగా బలంగా రూపొందించారు. అనుకూల రాజకీయ పార్టీలతో జట్టు కట్టి ప్రత్యర్థి రాజకీయ పార్టీలను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించారు.
అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఎంతోమంది రాజకీయ ప్రత్యర్థులను , వ్యాపారులు, పారిశ్రామికవేత్తలను వేధించిన రవిప్రకాష్ చివరకు తెలంగాణలో అప్పుడే అధికారంలోకి వచ్చిన కేసీఆర్ తోనూ పెట్టుకున్నాడు. అదే అతడి పతనానికి నాంధి అయ్యింది. తెలంగాణ సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేసిన రవిప్రకాష్ ను తన అధికార బలంతో కేసీఆర్ ఔట్ చేశాడు. ఆ సంస్థ నుంచే చాకచక్యంగా పంపించేశాడు. లొసుగులు అన్నీ లాగి కేసులు పెట్టించి.. ఫ్రాడ్ చేశాడని తేలడంతో బయటకు పంపించారు. అయితే ఇందులో రవిప్రకాష్ చేసిన తప్పులున్నాయి. కరెక్ట్ మగాడు తగిలితే ఎదుర్కోవడం ఎంత కష్టమో రవిప్రకాష్ కు అప్పుడే తెలిసివచ్చిందని మీడియా సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తాయి.
Also Read: Rajamouli: ఆర్ఆర్ఆర్ పై ఢిల్లీ ఎఫెక్ట్.. అయినా రిలీజ్ ఖాయం.. కారణం అదే!
ఎప్పుడైతే రవిప్రకాష్ లాంటి మహావృక్షం ఆ సంస్థనుంచి బయటకు వెళ్లిందో ఆయన తర్వాత ఉన్న సీనియర్ జర్నలిస్టుల్లో ఎవరికి వారు ఆధిపత్య పోరుతో సంస్థపై గుత్తాధిపత్యం కోసం ప్రయత్నించారు. ఈ క్రమంలోనే చాలా మంది ఎగిరిపోయారు.
ఎట్టకేలకు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న టీవీ9 యజమానులను ఒప్పించి మెప్పించి సీనియర్ జర్నలిస్టు రజినీకాంత్ ప్రస్తుతానికి టీవీ9కు అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. అయితే ఆయన సమకాలీకులైన వారికి ఇది నచ్చడం లేదు. మిగతా జర్నలిస్టులకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ఇప్పటికే చాలా మంది వెళ్లిపోయారు. తాజాగా మరో బిగ్ వికెట్ పడింది.
టీవీ9 నుంచి సీనియర్ జర్నలిస్టు, న్యూస్ ప్రజెంటర్ మురళీకృష్ణ వెళ్లిపోయారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రకటించారు. త్వరలోనే కొత్త చోట చేరుతానని ప్రకటించారు. అయితే మురళీ కృష్ణ వెళ్లిపోవడానికి అసలు కారణమేంటన్న గుసగుసలు మీడియా సర్కిల్స్ లో జోరుగా సాగుతున్నాయి.
కొంతకాలంగా టీవీ9లో అగ్రస్థాయి జర్నలిస్టుల మధ్య ఇగో సమస్యలు బాగా వస్తున్నాయట.. రవిప్రకాష్ తర్వాత రజినీకాంత్ కు పగ్గాలు ఇవ్వడంతో తాము కూడా ఆస్థాయి సీనియర్లమే అనని ఆయన మాటను ఎవరూ వినడం లేదట.. రజినీకాంత్ మిగతా వారికి ప్రాధాన్యం ఇవ్వకుండా అన్నీ తానై వ్యవహరిస్తుండడంతో మురళీకృష్ణ లాంటి వారికి సంస్థలో ప్రాధాన్యం తగ్గిపోయింది. పెద్దగా చర్చా కార్యక్రమాల్లోనూ మురళీ కృష్ణను ప్రైమ్ టైంలో కొనసాగించకపోవడం ఆయనలో అసహనానికి దారితీసింది. ఆ అసంతృప్తి నుంచే ఇక టీవీ9ను వదిలేయాలని మురళీ కృష్ణ డిసైడ్ అయినట్టు తెలిసింది.
ఇక మరో టాప్ చానెల్ ఎన్టీవీలో ఇప్పటికీ మెరుగైన జర్నలిస్ట్ లేడు. సరైన చర్చలు జరిపే సీనియర్ కోసం ఆ సంస్థ చూస్తోంది. ఈ క్రమంలోనే మురళీ కృష్ణ కు ఆ సంస్థ ఆఫర్ ఇచ్చిందని.. అందుకే టీవీ9ను వదిలేసి ఎన్టీవీలో మురళీకృష్ణ చేరబోతున్నాడని టాక్ నడుస్తోంది.
వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీవీ9 తరుఫున వైఎస్ ప్రతినిధిగా మురళీకృష్ణ ప్రత్యేక గుర్తింపు పొందాడు. వైఎస్ తో ఇంటర్వ్యూలు.. ఆయనతో సహచర్యం నడిపారు. అదే ఆయనను టాప్ స్థాయికి చేర్చింది.
Dear all one #BIGNEWS Tv9 కి నేను రాజీనామా చేశాను. ఈ రోజే official గా రిలీవింగ్ లెటర్ తీసుకున్నా. తదుపరి ప్రయాణం త్వరలో… pic.twitter.com/J7IRTrMH4K
— Murali Krishna Journalist (@encounterwithmk) December 29, 2021
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Big wicket journalist muralikrishna out from tv9 this is the real reason
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com