BARC Ratings : ఇవి సోషల్ మీడియా రోజులు. అంటే ఎవరి అభిప్రాయాన్ని వారు సొంతంగా వ్యక్తీకరించుకోవచ్చు. న్యూస్ చానల్స్ పరిస్థితి కూడా అదే విధంగా మారిపోయింది. ఒక పార్టీకి డప్పు కొట్టడం.. గిట్టని పార్టీ మీద లీటర్ల కొద్ది బురద చల్లడం అలవాటుగా మారిపోయింది. అయితే గుడ్డిలో మెల్ల అన్నట్టుగా ఈ న్యూస్ చానల్స్ విషయంలో వేటి పరిస్థితి ఏమిటి అనేది అప్పుడప్పుడూ చర్చలోకి వస్తుంది. జర్నలిస్ట్ సర్కిల్స్ లో మాత్రమే కాదు.. పొలిటికల్ సర్కిల్లోనూ ఒకింత దీని గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుంది. తెలుగు న్యూస్ ఛానల్స్ విషయానికి వస్తే టీవీ 9, ఎన్ టీవీ మధ్య పోటీ ఉంది. గొప్పగా చెప్పుకునే టివి9 బాగా చతికిలపడిపోయింది. మళ్లీ లేవడం లేదు. ఇప్పట్లో లేస్తుందనే గ్యారంటీ లేదు. మొదటి స్థానంలోకి వచ్చిన తర్వాత ఎన్ టివి తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంటున్నది. అసలు ఎన్టీవీ వార్తల్లో ఏముందని ఫస్ట్ ప్లేస్ అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ లెక్కకు వస్తే టీవీ 9 విశిష్టత ఏమిటి అనే ప్రశ్న కూడా ఉదయిస్తోంది.. పాత పోస్కో, అప్పటి ఆటో స్పై, ఆ మధ్య దేవి రుధిరం వంటి జ్ఞాన గుళికలు టీవీ9 లో చాలానే ఉన్నాయి. మొన్న ఎవరో క్వాష్ బదులు స్క్వాష్ అన్నారు. ఇంత చెబుతున్నారు ఎన్టీవీ వాళ్ళు ఏమైనా గొప్ప ప్రొఫెషనల్సా అని అడగకండి. దానిని పోల్చడానికి బార్క్ అనే ఒక కొలమానం ఉంది.(జాబితా చూస్తే టీవీ 9 ఆఫీసుల్లో కేకుల పండుగలు, ఫ్లెక్సీల హడావిడి, కుట్రలతో నెంబర్ వన్ స్థానం సాధించలేరు..అనే మాటలు వినిపించడం లేదు, కనిపించడం లేదు)
తాజాగా విడుదలైన భారత రేటింగ్స్ ప్రకారం టీవీ9 కంటే ఎన్టీవీ బెటర్ పొజిషన్లో ఉంది. పేరుకు మూడో స్థానంలో ఉన్నప్పటికీ వీ6 టీవీ9, ఎన్టివి కంటే చాలా దూరంలో ఉంది. టీవీ5, ఏబీఎన్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అవి ఫస్ట్ ప్లేస్ చానల్స్ కు చాలా దూరంలో ఉన్నాయి. అయితే తాజా జాబితా ప్రకారం ఏబీఎన్ పెరుగుదల ఇలాగే ఉంటే అది టీవీ 5 చానెల్ ను రెండు లేదా మూడు వారాల్లో కొట్టేయగలదు. ఈటీవీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఈటీవీలో వచ్చే రాత్రి 9 గంటల ప్రైమ్ న్యూస్ మినహా ఈటీవీ న్యూస్ ఛానల్స్ దాదాపు దండగ. ఇక పచ్చ ఛానల్స్ కు కౌంటర్ గా చెప్పుకునే సాక్షి టివి మరింత కిందికి వెళ్తోంది. అది ఏడవ స్థానంలో కొట్టుమిట్టాడుతోంది. అయినప్పటికీ జగన్ తన మీడియాను పట్టించుకోడు. బట్టి సాక్షి టీవీ ఇప్పట్లో పుంజుకునే అవకాశాలు లేవు.(ఇంత దారుణంగా ఉన్నప్పటికీ సాక్షి మీద జగన్ కన్నా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఎక్కువ ఆలోచిస్తుంటాడు. కొత్త పలుకులో సాక్షి గురించే ఎక్కువగా ప్రస్తావిస్తూ ఉంటాడు)
ఇక తెలుగు సంగతి పక్కన పెడితే జాతీయ స్థాయి విషయానికి వస్తే.. ముఖేష్ అంబానీ ఆధ్వర్యంలో నడుస్తున్న న్యూస్ 18 కు సరైన స్థాయిలో ఉంది టీవీ9 కు చెందిన భారత్ వర్ష్ న్యూస్.(టీవీ9 కన్నడ, టీవీ9 మరాఠీ కూడా మంచి స్థానాల్లోనే ఉన్నాయి) ఆజ్ తక్, ఇండియా టీవీ.. ఆ తర్వాతే రిపబ్లిక్ భారత్ (ఈ పేరుకోసమే ప్రకాష్ ఫైట్ చేస్తున్నాడు) ఒకప్పుడు ఏవో మాయలు మంత్రాలు చేసి, ఎవరికి అందనంత ఎత్తులో నిలిచిన రిపబ్లిక్ టీవీ ఇప్పుడు ఏకంగా ఐదవ స్థానంలోకి పడిపోయింది..సో తాజా బార్క్ రేటింగ్స్ ప్రకారం టీవీ9 భారత్ వర్ష నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది అని అర్థం. అది ముఖేష్ అంబానికి చెందిన నెట్వర్క్ 18 తో పోటీ పడుతోంది అని అర్థం. కానీ ఆ స్థాయిలో పోటీ ఇక్కడ నరేంద్ర చౌదరితో ఎందుకు సాధ్యం కావడం లేదు.. దీని గురించి రజనీకాంత్ ఏమైనా ఆలోచిస్తున్నాడా?!
Bhaskar is a senior Journalist covers articles on Politics, General and entertainemnt news.
Read More