Horoscope : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. అక్టోబర్ 30న సోమవారం ద్వాదశ రాశులపై కృత్తిక నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈ ప్రభావంతో కొన్ని రాశులవారికి ఊహించని లాభాలు ఉంటాయి. నేటి 12 రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. ఆర్థిక పరంగా ఊహించని లాభాలు రావొచ్చు. కుటువంబ సభ్యుల నుంచి కొన్ని ఆశ్చర్యకరమైన వార్తలు వింటారు. ఆహ్లాదంగా గడుపుతారు.
వృషభం:
ఉద్యోగులకు కార్యాలయాల్లో ప్రతికూల వాతావరణం ఉంటుంది. ఎక్కువగా వాదనలు చేయకపోవడమే మంచిది. కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. ఏ పని మొదలు పెట్టినా అసంపూర్తిగానే మిగిలిపోతుంది.
మిథునం:
ఆకస్మికంగా ధన లాభం ఉంటుంది. దీంతో విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని ముఖ్యమైన మార్పులు జరుగుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి.
కర్కాటకం:
మానసిక ఆందోళనలు ఉంటాయి. ఉద్యోగులు ఇబ్బందుల వాతావరణంలో గడుపుతారు. ఆర్థిక పరంగానూ బలహీనంగా మారుతారు. మనో ధైర్యంతో ముందుకు సాగాలి.
సింహం:
పెండింగ్ పడుతున్న సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఎవరినీ గుడ్డిగా నమ్మొద్దు. రుణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సమాజిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు.
కన్య:
కుటుంబ సభ్యులతో విభేదాలు ఉంటాయి. ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. మనసులో ప్రతికూల ఆలోచనలు వస్తాయి. కొంచెం సంయమనంతో పాటించాలి.
తుల:
ఆర్థికంగా లాభపడుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిర్ణయాలు తీసుకోవడం తడబడొద్దు. ఖర్చులు పెరగడం వల్ల మానసిక ప్రశాంతతను కోల్పోతారు.
వృశ్చికం:
ఆర్థికంగా అనుకున్న ఫలితాలు ఉండకపోవచ్చు. మనసులో చికాకులు ఏర్పడుతాయి. ప్రతీ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. కార్యాలయంలో పనిచేసేవారు గందరగోళ వాతావరణంలో గడుపుతారు.
ధనస్సు:
కొంచెం కష్టపడడం వల్ల ఆకస్మిక ధన లాభం వచ్చే అవకాశం. ఏ పనినైనా నిర్లక్ష్యంతో చేయొద్దు. లేకుంటే తీవ్రంగా నష్టపోతారు. భాగస్వాముల వ్యాపారంతో అనుకున్న ఫలితాలు ఉంటాయి.
మకరం:
ఆరోగ్యం అంతగా బాగుండకపోవచ్చు. ఆస్తుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సోదరుల మధ్య మనస్పర్థలు ఉండే అవకాశం.
కుంభం:
కొన్ని పనుల పట్ల నిజాయితీగా ఉండడంతో సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఒక శుభవార్త వింటారు. ఆర్థిక పరంగా ఊహించని లాభాలు వస్తాయి.
మీనం:
ఈ రాశివారికి ప్రతికూల ఫలితాలు ఉండే అవకాశాలు ఎక్కువ. చిన్న విషయానికే పెద్దగా టెన్షన్ పడిపోతారు. భాగస్వామి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని పనులు వాయిదా వేసుకోవడమే మంచిది.